మెర్సిడెస్‌ కొత్త వర్షన్స్‌ భారత్‌కు వచ్చేశాయ్‌! ధరలు ఇవే..

26 May, 2023 08:56 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్‌ బెంజ్‌ 2023 వర్షన్‌ ఎంట్రీ లెవెల్‌ సెడాన్‌ అయిన ఏ–క్లాస్‌ లిమోసిన్‌ను రూ.45.80 లక్షల ధరలో ప్రవేశపెట్టింది. ఎనిమిదేళ్ల వారంటీ ఉంది. 10.25 అంగుళాల ఎంబీయూఎక్స్‌ డిజిటల్‌ డిస్‌ప్లే, 17 అంగుళాల 5 స్పోక్‌ అలాయ్‌ వీల్స్, కొత్త ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్స్, 7 ఎయిర్‌బ్యాగ్స్‌ పొందుపరిచారు. 

అలాగే ఎంట్రీ లెవెల్‌ పెర్ఫార్మెన్స్‌ హ్యాచ్‌బ్యాక్‌ ఏ 45 ఎస్‌ ఏఎంజీ 4మేటిక్‌ ప్లస్‌ను రూ.92.5 లక్షల ధరలో పరిచయం చేసింది. 2.0 లీటర్‌ 4 సిలిండర్‌ టర్బోచార్జ్‌డ్‌ ఏఎంజీ పెట్రోల్‌ ఇంజన్‌తో తయారైంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.9 సెకన్లలో అందుకుంటుంది.

ఇదీ చదవండి: ర్యాపిడో బైక్‌ కెప్టెన్లకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై మరింత ఆదాయం

మరిన్ని వార్తలు