మెర్సిడెస్‌ బెంజ్‌ నుంచి కొత్త మోడల్‌

24 Aug, 2021 02:09 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్‌ బెంజ్‌ సరికొత్త ‘ఏఎంజీ జీఎల్‌ఈ 63 ఎస్‌ 4మేటిక్‌ ప్లస్‌ కూపే’ కారును ప్రవేశపెట్టింది. ఏఎంజీ శ్రేణిలో ఇది 12వ మోడల్‌. ధర ఎక్స్‌షోరూంలో రూ.2.07 కోట్లు. 4 లీటర్‌ ఇంజన్, 612 హెచ్‌పీ పవర్, అదనంగా 22 హెచ్‌పీ అందించే 48 వోల్ట్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌ పొందుపరిచారు. 3.8 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 280 కిలోమీటర్లు. అన్ని వైపులా ఎయిర్‌బ్యాగ్స్, బ్లైండ్‌ స్పాట్‌ అసిస్ట్, యాక్టివ్‌ బ్రేక్‌ అసిస్ట్, 3 స్టేజ్‌ ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి హంగులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు