Mercedes-Benz: సంచలనం! ఎలన్ మస్క్‌కు ఎదురు దెబ్బ..ఈ ఎలక్ట్రిక్‌ కార్‌ రేంజ్‌ వెయ్యి కిలోమీటర్లు!

16 Apr, 2022 20:03 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న ఎలన్‌ మస్క్‌కు ఎదురు దెబ్బ తగలనుంది. ఈవీ మార్కెట్‌లో టెస్లా కంటే మెర్సిడెజ్‌ బెంజ్‌ దూసుకొస్తుంది. మెర్సిడెజ్‌ బెంజ్‌కు చెందిన ఏజీ ఎలక్ట్రిక్‌ కార్‌ వెయ్యికంటే ఎక్కువ కిలోమీటర్ల రేంజ్‌లో మార్కెట్‌కి పరిచయం కానుందని బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక పేర్కొంది.    

మెర్సిడెస్ బెంజ్ ఏజి ఈక్యూఎక్స్‌ఎక్స్‌ ఎలక్ట్రిక్ కారు సింగిల్‌ ఛార్జింగ్‌తో జర్మనీ నుండి ఫ్రెంచ్ రివేరాకు 1000 కిలోమీటర్ల (621 మైళ్ళు) పైగా ప్రయాణించిందని, ఈ విషయంలో మెర్సిడెజ్‌ బెంజ్‌ టెస్లాను అధిగమించినట్లు బ్లూమ్‌ బెర్గ్‌ నివేదిక హైలెట్‌ చేసింది. ఈక్యూఎక్స్ఎక్స్ ప్రోటోటైప్ ఎలక్ట్రిక్‌ కారు జర్మనీ నుండి బయలుదేరి, స్విట్జర్లాండ్, ఇటలీ మీదుగా ఒకేసారి 12 గంటలు నాన్ స్టాప్ గా ప్రయాణించి, దాని బ్యాటరీ ప్యాక్ లో ఇంకా 140 కిలోమీటర్ల పరిధి ఉండగా ఫ్రాన్స్ కు చేరుకున్నట్లు మెర్సిడెస్ తెలిపింది.


మెర్సిడెస్ ప్రకారం..ఫ్రాన్స్ చేరుకున్నప్పుడు బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ సుమారు 15శాతం. ఇది 140 కిలోమీటర్ల (87 మైళ్ళు) మిగిలిన పరిధికి సమానం. సగటు వినియోగం 100 కిలోమీటర్లకు 8.7 కిలోవాట్ (62 మైళ్లకు 7.1 కిలోవాట్ల) రికార్డు స్థాయి కనిష్ట స్థాయికి చేరుకుంది. "మేం సాధించాం. 1000 కిలోమీటర్లకు పైగా ఒకే బ్యాటరీ ఛార్జ్ పై తేలికగా, సాధారణ రోడ్లమీద ట్రాఫిక్ లో సైతం కేవలం 8.7 కేడ్ల్యూహెచ్‌ /100 కేఎం (ప్రతి 62 మైళ్లకు 7.1 కేడ్ల్యూహెచ్‌) మాత్రమే వినియోగించింది. విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత సమర్థవంతమైన మెర్సిడెస్ అని మెర్సిడెస్ బెంజ్ గ్రూప్ ఎజి బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్మన్ ఓలా కాల్లెనియస్ చెప్పారు.

మెర్సిడెస్ 2026నాటికి 60 బిలియన్ యూరోలు (65 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసి టెస్లాను అధిగమించడానికి, దాని ప్రత్యర్థి బీఎండబ్ల్యూఎజి నుండి ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన లగ్జరీ కార్ల తయారీదారు అనే బ్రాండ్‌ను తిరిగి పొందాలని చూస్తుంది. ఈ దశాబ్దం చివరి నాటికి సాధ్యమైనంత వరకు ఈవీలను మాత్రమే విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భాగస్వాములతో ఎనిమిది బ్యాటరీ కర్మాగారాలను ఏర్పాటు చేయాలని మెర్సిడెజ్‌ బెంజ్‌ యాజమాన్యం యోచిస్తోంది.

మరిన్ని వార్తలు