-

Mercedes EQE Electric Sedan: టెస్లాకు పోటీగా మెర్సిడిజ్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ కారు..!

7 Sep, 2021 19:29 IST|Sakshi

మ్యునీచ్‌:  ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలో రారాజు ఎవరంటే ఠక్కున చెప్పే పేరు టెస్లా. ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లకు ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహన మార్కెట్‌లో టెస్లా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ, ఏకఛత్రాధిపత్యంగా ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్లను టెస్లా ఏలుతుంది. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో టెస్లాకు పోటీగా ఇప్పటికే ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు సిద్ధమైయ్యాయి.
చదవండి: బీఎమ్‌డబ్ల్యూ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌..! చూస్తే వావ్‌ అనాల్సిందే..!

తాజాగా జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ఆటో మొబిలీటీ షోలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడిజ్‌ బెంజ్‌ తన కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును లాంచ్‌ చేసింది.  మెర్సిడిజ్‌ ఈక్యూఈ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ కారును ఐఏఏ మొబిలిటీ 2021 షోలో మెర్సిడిజ్‌ ప్రదర్శనకు ఉంచింది. ఈ కారు ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజ సంస్థ టెస్లా కంపెనీకి చెందిన టెస్లా ఎస్‌ మోడల్‌ కారుకు పోటీగా నిలవనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా 2022 సంవత్సరంలో ఈ కారు కొనుగోలుదారులకు అందుబాటులోకి  రానుంది. మెర్సిడిజ్‌ ఈక్యూఈ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ కారు ఒక్క ఛార్జ్‌తో సుమారు 660 కిమీ ప్రయాణించవచ్చునని కంపెనీ వెల్లడించింది. ఈ కారులో 90kWh బ్యాటరీ అమర్చారు. డీసీ చార్జింగ్‌ కెపాసిటీలో భాగంగా 170kW బ్యాటరీని ఏర్పాటుచేసింది. అంతేకాకుండా 430 లీటర్ల బూట్‌ స్పేస్‌ను అందించనుంది.  మార్కెట్‌లోకి రెండు వేరియంట్ల రూపంలో ఈ కారు రిలీజ్‌ కానుందని కంపెనీ పేర్కొంది. 

చదవండి: భారత్‌లో సొంత షోరూమ్స్‌.. ఆన్‌లైన్‌ ద్వారా ఆ ఫీట్‌ సొంతం అయ్యేనా?

మరిన్ని వార్తలు