మెర్సిడెస్ బెంజ్ ప్రియులకు షాక్..!

17 Mar, 2022 20:15 IST|Sakshi

ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన కారు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి తన మొత్తం మోడల్ కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు నేడు సంస్థ తెలిపింది. ఇన్ పుట్ ఖర్చుల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణం అని కంపెనీ పేర్కొంది. కారు మోడల్ బట్టి రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

"మెర్సిడెస్ బెంజ్ వినియోగదారులకు సాటిలేని అనుభూతిని అందించడం కోసం అత్యంత అధునాతన సాంకేతికతను అందిస్తున్నాము. అయితే, వ్యాపారాన్ని స్థిరంగా నడపడానికి ఇన్ పుట్, కార్యాచరణ ఖర్చులలో నిరంతర పెరుగుదలను భర్తీ చేయడానికి ధరల దిద్దుబాటు అవసరం" అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండి & సీఈఓ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఆడి ఇండియా ఏప్రిల్ 1 నుంచి 3 శాతం వరకు తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

(చదవండి: హ్యాకర్ల దెబ్బకు వణికిపోతున్న రష్యా.. వెబ్‌సైట్లు డౌన్.!)

మరిన్ని వార్తలు