మెర్సిడెస్‌ నుంచి కొత్త కారు.. ప్రారంభానికి ముందే అదిరిపోయే బుకింగ్స్‌!మ

11 May, 2022 11:15 IST|Sakshi

మెర్సిడెస్‌ కొత్త సి–క్లాస్‌ 

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ తాజాగా భారత్‌లో సి–క్లాస్‌ సెడాన్‌ కొత్త వర్షన్‌ ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.55 లక్షల నుంచి ప్రారంభం. 1.5 లీటర్‌ గ్యాసోలిన్‌ ఇంజన్‌తో సి–220, అలాగే 2.0 లీటర్‌ డీజిల్‌ పవర్‌ట్రైన్స్‌తో సి–220డి, 330డి రూపుదిద్దుకున్నాయి. సి–200 రూ.55 లక్షలు, సి–220డి రూ.56 లక్షలు, 330డి రూ.61 లక్షలు ఉంది. 

మెర్సిడెస్‌ సి–క్లాస్‌ సెడాన్‌ కొత్త వర్షన్‌కి అంచనాలను మించి కస్టమర్ల నుంచి స్పందన ఉందని కంపెనీ తెలిపింది. 1,000 పైగా యూనిట్లకు ముందస్తు బుకింగ్స్‌ ఉన్నాయని, ఇది 2–3 నెలల వరకు వెయిటింగ్‌ పీరియడ్‌కు దారితీసిందని వెల్లడించింది. ఈ స్థాయి ప్రీ బుకింగ్స్‌ మెర్సిడెస్‌కు ఇదే తొలిసారి అని వివరించింది. 2022లో మొత్తం 10 ఉత్పత్తులను పరిచయం చేయాలన్నది సంస్థ లక్ష్యం. వీటిలో సి–క్లాస్‌ కొత్త వర్షన్‌తో సహా రెండు అందుబాటులోకి వచ్చాయి.
చదవండి: వామ్మో ఆ కారుకి అంత డిమాండా? ఏడాదిన్నర వెయిటింగ్‌ పీరియడ్‌!!

మరిన్ని వార్తలు