Mercedes-Benz: ఎలక్ట్రిక్‌ వాహనాల్లో సంచలనం..! ఒక్కసారి ఛార్జ్‌తో 1000 కిమీ ప్రయాణం..!

27 Nov, 2021 15:59 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ కార్లలో రారాజు అంటే కచ్చితంగా టెస్లా పేరే చెప్పొచ్చు...! రానున్న రోజుల్లో టెస్లా స్థానాన్ని చేజిక్కించుకునేందుకు పలు ఆటోమొబైల్‌ కంపెనీలు సిద్దమైనాయి. టెస్లాకు గట్టిపోటీ ఇవ్వాలంటే కార్ల రేంజ్‌ చాలా ముఖ్యమైనది. ఆయా కంపెనీలు రూపొందిస్తోన్న ఈవీ కార్లల్లో రేంజ్‌ ఎక్కువగా ఇచ్చేందుకు విశ్వప్రయత్నాలను చేస్తున్నాయి. రేంజ్‌ను ముఖ్యంగా భావించిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌ ఈవీ కార్ల ఉత్పత్తిలో ఒక ముందడుగు వేసింది. 

ఒక్కసారి ఛార్జ్‌తో ఏకంగా 1000 కిమీ ప్రయాణం...!
ఎలక్ట్రిక్‌ కార్ల రేంజ్‌ విషయంలో మెర్సిడెజ్‌ బెంజ్‌ సంచలన విజయాన్ని నమోదుచేసినట్లు తెలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్‌తో ఏకంగా 1000కిమీ మేర ప్రయాణం సాగించే ఈవీ కారును వచ్చే ఏడాది జనవరి  3 మెర్సిడెజ్‌ ఆవిష్కరించనుంది. మెర్సిడెజ్‌ విజన్‌ ఈక్యూఎక్స్‌ఎక్స్‌ కాన్సెప్ట్‌ కారుకు సంబంధించిన టీజర్‌ను కంపెనీ లాంచ్‌ చేసింది.

ఈవీ కార్లలో ఎరోడైనమిక్స్‌ ఫీచర్‌తో, అత్యధిక వేగంగా వెళ్లే కారుగా విజన్‌ ఈక్యూఎక్స్‌ఎక్స్‌ నిలుస్తోందని కంపెనీ సీవోవో మార్కస్‌ స్కాఫర్‌ వెల్లడించారు.మెర్సిడెజ్‌లోని ఈక్యూఎస్‌ కానెస్ట్‌కారు కంటే తక్కువ డ్రాగ్‌ కోఫిషియంట్‌ ఈక్యూఎక్స్‌ఎక్స్‌ కల్గి ఉంటుందని మార్కస్‌ పేర్కొన్నారు. 
చదవండి: ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్!

మరిన్ని వార్తలు