ఆర్‌ఆర్‌ఆర్‌ ఎంట్రీ..పీవీఆర్‌తో కొత్త దోస్తీ..ఊహించని లాభాలు సొంతం...!

28 Mar, 2022 17:55 IST|Sakshi

కోవిడ్‌-19 రాకతో గత రెండేళ్లుగా మల్టీప్లెక్స్‌ థియేటర్ల పరిస్థితి దారుణంగా మారింది. దిగ్గజ మల్టీప్లెక్స్‌ సంస్థలు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. దీంతో నష్టాలనుంచి బయటపడేందుకుగాను పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్‌ మల్టీప్లెక్స్‌ సంస్థలు విలీనానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్‌ కంపెనీలకు భారీగా కలిసొచ్చింది.

కలిసొచ్చిన విలీనం..!
పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్‌ కంపెనీలు వీలినమవుతున్నట్లు ఆదివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌ పేర్కొన్నాయి. దీంతో సోమవారం రోజున ఇరు కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ షేర్లు దూసుకుపోయాయి. ఐనాక్స్ షేర్లు  20 శాతం పెరిగి రూ.563 కి చేరుకోగా..ప్రీ కోవిడ్‌ గరిష్టాలను అధిగమించడం గమనార్హం. ఇక పీవీఆర్‌ షేర్లు 10 శాతం లాభపడి రూ. 2010. 34 మేర పెరిగాయి. వీలిన ప్రక్రియలో భాగంగా ఐనాక్స్‌ షేర్‌ హోల్డర్స్‌ పది  ఐనాక్స్‌ షేర్లకు పీవీఆర్‌ మూడు షేర్లు దక్కనున్నాయి. 

ఆర్‌ఆర్‌ఆర్‌ ఎంట్రీతో..
దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం మల్టీప్లెక్స్‌ థియేటర్లకు బాగా కలిసొచ్చింది. పీవీఆర్‌ లిమిటెడ్, ఐనాక్స్‌ లీజర్‌ షేర్లు రెండేళ్ల గరిష్టాలకు చేరాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ మల్టీప్లెక్స్‌ సంస్థలకు ఫుల్‌ జోష్‌ను నింపింది.  

చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో విదేశీ కంపెనీ..!

మరిన్ని వార్తలు