ఇన్‌ఫ్లుయెన్సర్లకు భారీ షాక్‌, మెటా మ‌రో సంచ‌ల‌న నిర్ణయం!

17 Dec, 2022 19:48 IST|Sakshi

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం మెటా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల కోసం 2020లో ఈ లైవ్ స్ట్రీమింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు అదే యాప్‌ను వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఆపేస్తున్నట్టు మెటా వెల్ల‌డించింది. దాంతో ఫిబ్ర‌వ‌రి 15 నుంచి సూప‌ర్ యాప్ నిలిచిపోనుంది. దాంతో యూజ‌ర్లు కొత్త పోస్టుల‌ను క్రియేట్ చేయ‌లేరు. 

లైవ్ స్ట్రీమింగ్ యాప్‌ను షట్‌డౌన్‌ చేయనున్న మెటా ఇప్పటికే పలు రకాల ప్రొడక్ట్‌లు, ప్రాజెక్ట్‌లను నిలిపివేసింది. ఈ వారం మొద‌ట్లో 10 ఏళ్ల నాటి క‌నెక్ట‌విటీ డివిజ‌న్‌ను షట్‌డౌన్‌ చేయనుంది. డెన్మార్క్‌లోని ఒడెన్సే సిటీలో రెండు కొత్త‌ డేటా సెంట‌ర్ల నిర్మాణాన్ని ఆపేసింది. 344 మిలియ‌న్ డాల‌ర్ల కాంట్రాక్ట్‌ను ర‌ద్దు చేసుకుంది. 2023లో బుల్లెటిన్ అనే న్యూస్ లెట‌ర్ ప్రొడ‌క్ట్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అక్టోబ‌ర్ నెల‌లో ప్ర‌క‌టించింది. ఆగ‌ష్టులో క్వెస్ట్ 1 వ‌ర్చువ‌ల్ రియాలిటీ హెడ్‌సెట్ త‌యారీని నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. డేటా సెంట‌ర్ల బ‌దులు ఆర్టిఫిషీయ‌ల్ ఇంటెలిజెన్స్ మీద ఫోక‌స్ చేయ‌ల‌నుకున్న‌ట్టు మెటా తెలిపింది. 

మరిన్ని వార్తలు