మెటా ఊహించని షాక్‌, భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించనున్న జూకర్‌బర్గ్!

7 Nov, 2022 10:21 IST|Sakshi

ట్విటర్‌ తర్వాత మెటా సైతం భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించనుంది. మరికొన్ని వారాల్లో మెటాలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులపై సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ వేటు వేయనున్నట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తన కథనంలో తెలిపింది. ఇదే అంశంపై మెటా యాజమాన్యం బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. 

ప్రకటన ఖర్చులపై పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావం పెట్టుబడిదారుల్లో భయాందోళనకు దారితీసింది. దీనికి తోడు టిక్‌టాక్ నుండి పోటీ,యాపిల్‌ ప్రైవసీ పాలసీలో మార్పులు చేయడం, మెటావర్స్‌పై భారీ ఎత్తున ఖర్చు చేయడం, సంస్థపై నియంత్రణ వంటి అంశాలు మెటాను ఉక‍్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 

వాటి ఫలితంగా అక్టోబర్‌లో నెలలో మెటావర్స్‌ షేర్లు 25 శాతం పడిపోయాయి. దీంతో మార్క్ జూకర్‌బర్గ్ సంపద విలువ అక్టోబర్ 27 నాటికి 11 బిలియన్ డాలర్లు తగ్గిపోవడంతో మెటా కంపెనీ షేర్ 36 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వచ్చే ఏడాది మెటా స్టాక్ మార్కెట్ విలువ నుండి సుమారు 67 బిలియన్లకు పడిపోనుందని అంచనా వేసింది. దీంతో జూకర్‌ బర్గ్‌  ఖర్చుల్ని తగ్గించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

అక్టోబర్‌ నెలలో మెటా ఫలితాల విడుదల సందర్భంగా మార్క్ జూకర్‌బర్గ్ మాట్లాడుతూ, మెటావర్స్‌పై పెట్టిన పెట్టుబడులకు ఫలితాలు వచ్చేందుకు దశాబ్దం పడుతుంది. ఈలోగా హైరింగ్ నిలిపివేయడం,ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగ బృందాల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. 2023లో ఉద్యోగుల సంఖ్యను ఇలాగే ఉంచడం లేదా, తగ్గించడం చేయాల్సి ఉంటుందని అన్నారు. తాజాగా అందుకు ఊతం ఇచ్చేలా మెటా ఉద్యోగుల్ని తొలగిస్తుందంటూ పలు నివేదికలు వెలుగులోకి రావడం చర్చాంశనీయంగా మారింది.

చదవండి👉 మార్క్‌ జుకర్‌బర్గ్ 'కక్కుర్తి' పని, వందల కోట్లకు ఇల్లు అమ్మకం!

మరిన్ని వార్తలు