మెటల్‌, బ్యాంక్స్‌ దన్ను- సెన్సెక్స్‌ ట్రిపుల్‌ 

11 Aug, 2020 09:34 IST|Sakshi

328 పాయింట్లు అప్‌- 38,510కు సెన్సెక్స్‌

87 పాయింట్లు ఎగసిన నిఫ్టీ- 11,357 వద్ద ట్రేడింగ్‌

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే

ప్రపంచ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 328 పాయింట్లు ఎగసి 38,510కు చేరింది. నిఫ్టీ 87 పాయింట్లు బలపడి 11,357 వద్ద ట్రేడవుతోంది. సోమవారం యూఎస్‌ మార్కెట్లు అటూఇటుగా నిలవగా.. ప్రస్తుతం ఆసియాలో సానుకూల ట్రెండ్‌ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఇన్వెస్టర్లు మరోసారి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో మార్కెట్లు వరుసగా నాలుగో రోజు జోరందుకున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

మీడియా, ఆటో సైతం
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడగా.. మెటల్‌ 2.4 శాతం,  ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. మీడియా, ఆటో, రియల్టీ సైతం 1.3-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యాక్సిస్‌, జీ, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, అల్ట్రాటెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐషర్‌, కొటక్‌ బ్యాంక్‌ 3.6-1 శాతం మధ్య లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో శ్రీ సిమెంట్‌, టైటన్‌, సిప్లా, యూపీఎల్‌ 3.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

నిట్‌ టెక్‌ అప్‌
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో నిట్‌ టెక్‌, సెయిల్‌, ఐబీ హౌసింగ్‌, నాల్కో, ఎస్కార్ట్స్‌, జిందాల్‌ స్టీల్‌, ఆర్‌బీఎల్, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఎంజీఎల్‌ 3.4-1.6 శాతం మధ్య పెరిగాయి. అయితే ఐడియా, నౌకరీ, బీవోబీ, అపోలో హాస్పిటల్స్‌, భారత్‌ ఫోర్జ్‌, కేడిలా హెల్త్‌, అమరరాజా, లుపిన్‌ 3.3-0.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5-0.75 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1204 లాభపడగా.. 365 నష్టాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు