రామ్‌కో సిమెంట్స్‌ చైర్మన్‌గా ఎంఎఫ్‌ ఫారూఖి

30 May, 2022 05:42 IST|Sakshi

ఎండీగా కొనసాగనున్న వెంకట్రామ రాజా

చైర్మన్, ఎండీ పదవుల విభజన

హైదరాబాద్‌: రామ్‌కో సిమెంట్స్‌ చైర్మన్‌గా ఎంఎఫ్‌ ఫారూఖిని నియమించుకుంది. చైర్‌పర్సన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవులు రెండింటినీ ఒక్కరే నిర్వహించకుండా, మరింత మెరుగైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ కోసం వీటిని వేరు చేయాలంటూ సెబీ లోగడ నిబంధనలు తీసుకొచ్చింది. నూతన నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో రామ్కో సిమెంట్స్‌ లిమిటెడ్‌ బోర్డు చైర్మన్, ఎండీ పదవులను వేరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

చైర్మన్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి  ఎంఎఫ్‌ ఫారూఖిని ఎంపిక చేసినట్టు సంస్థ ప్రకటించింది. ఇక ఇప్పటి వరకు చైర్మన్, ఎండీగా సేవలు అందించిన కంపెనీ వ్యవస్థాపకుడు పీఆర్‌ వెంకట్రామ రాజా ఎండీగా కొనసాగుతారని కంపెనీ ప్రకటించింది. ఎండీగా ఆయన పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 3తో ముగియనుంది. అయితే, ఆ తదుపరి మరో ఐదేళ్ల కాలానికి ఎండీగా నియమించినట్టు రామ్‌కో సిమెం ట్స్‌ తెలిపింది. ఈ నిర్ణయాలకు రానున్న కంపెనీ ఏజీఎంలో వాటాదారుల ఆమోదం తీసుకోనుంది. 

మరిన్ని వార్తలు