ఈవీ విక్రయాలపై ఎంజీ మోటార్‌ కన్ను

24 Apr, 2023 04:06 IST|Sakshi

ఈ ఏడాది 30 శాతం వృద్ధిపై అంచనాలు

న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్‌ మొబిలిటీపై దృష్టిపెట్టిన ఎంజీ మోటార్స్‌ ఈ ఏడాది ఈవీ విక్రయాల్లో 30 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా వచ్చే నెలలో ఈవీ విభాగంలో మరో మోడల్‌ను విడుదల చేయనుంది.

ప్రస్తుతం స్థానిక మార్కెట్లో జెడ్‌ఎస్‌ ఈవీని విక్రయిస్తున్న కంపెనీ రెండు డోర్ల ఈవీ మోడల్‌ కామెట్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మే నెల నుంచి దశలవారీగా దేశమంతటా వాహ నాలను విడుదల చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ ఎండీ రాజీవ్‌ చాబా పేర్కొన్నారు. వెరసి ఈ ఏడాది రెండు ఈవీ మోడళ్ల ద్వారా 80, 000–90,000 యూనిట్ల విక్రయాలను సాధించగలమని విశ్వసిస్తున్నట్లు తెలియజేశారు.

మరిన్ని వార్తలు