సరికొత్త హంగులతో విడుదలైన ఎంజీ జెడ్‌ఎస్‌ ఎలక్ట్రిక్ కారు..!

7 Mar, 2022 16:34 IST|Sakshi

ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మోరిస్ గ్యారేజీస్(ఎంజీ) మోటార్స్ నేడు తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్‌యువీ) 'జెడ్ఎస్ ఈవీ' అప్డేట్ వెర్షన్ కారును భారతదేశంలో లాంఛ్ చేసింది. ఎంట్రీ లెవల్ ఎక్స్ ప్లోజ్ వేరియంట్ కొత్త ధర ఇప్పుడు రూ.21.99 లక్షల అయితే, టాప్ వేరియంట్ కారు ధర రూ.25.88 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఇండియా)గా ఉంది. గత వెర్షన్ కార్లతో పోలిస్తే ఈ కొత్త కారులో అనేక మార్పులు చేశారు. గతంలో ఉన్న డీప్‌ కాన్‌కేవ్‌ లే అవుట్‌ స్థానంలో ఎన్‌క్లోజ్డ్‌ గ్రిల్‌ను అమర్చారు. ఇక ఎంజీ లోగోకు పైన ఉన్న ఛార్జింగ్‌ సాకెట్‌ను మార్చారు. దానిని లోగోకు ఎడమ భాగంలోకి అమర్చారు.

ద్ద సెంట్రల్‌ ఎయిర్‌ డ్యామ్‌, చివర్లలో నిలువు ఇంటేక్స్‌తో బంపర్‌ డిజైన్‌ను తీర్చిదిద్దారు. ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను అప్‌డేట్‌ చేశారు. వెనుక సీట్లకూ ఆర్మ్‌రెస్ట్‌ను అమర్చారు. వెనుక సీట్లకు ఏసీ వెంట్లు, సెంటర్‌ హెడ్‌ రెస్ట్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఇందులో 50.3కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల (ఐసీఏటీ ప్రకారం) వరకు వెళ్లగలదు అని ఎంజీ మోటార్స్ పేర్కొంది. ఇది మునుపటి వెర్షన్ క్లెయిమ్ చేసిన  రేంజ్ కంటే 42 కిలోమీటర్లు ఎక్కువ. ఫెర్రిస్ వైట్, కర్రంట్ రెడ్, అషెన్ సిల్వర్, సాబుల్ బ్లాక్ అనే నాలుగు కలర్ రంగులలో కొత్త జెడ్ఎస్ కారు లభిస్తుంది. 

కేవలం 8.5 సెకన్లలోనే 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఇది 176హెచ్పి పవర్, 353 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు టాటా నెక్సన్ ఈవీ, హ్యుందాయ్ కోనాకు పోటీగా నిలుస్తుంది. జడ్ఎస్ కారు వైర్ లెస్ ఛార్జింగ్, డిజిటల్ బ్లూటూత్ కీ, పనోరమిక్ సన్ రూఫ్, అప్ డేట్ చేసిన ఐ-స్మార్ట్ కనెక్టెడ్ కార్ టెక్, 6 ఎయిర్ బ్యాగులతో కూడా వస్తుంది. కొత్త జడ్ఎస్ ఈవీలో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, కొత్త 7.0 అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. లేన్ ఛేంజ్ అసిస్టెన్స్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, హిల్ డీసెంట్ కంట్రోల్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి 360 డిగ్రీల కెమెరా జబర్దస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

(చదవండి: 'బాబూ పుతిన్‌..మనదగ్గర బేరాల్లేవమ్మా')

మరిన్ని వార్తలు