MG Comet EV: ఎంజీ స్మార్ట్ కాంపాక్ట్ కామెట్‌ ప్రొడక్షన్‌ షురూ, లాంచింగ్‌ సూన్‌!

13 Apr, 2023 15:59 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా స్మార్ట్ కాంపాక్ట్ ఈవీని ‘కామెట్‌’ ఉత్పత్తిని ప్రారంభించింది. గుజరాత్‌లోని తన హలోల్ ప్లాంట్ నుండి తొలి ఈవీని  ప్రదర్శించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన జీస్‌ఈవీ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా, సాలిడ్ స్టీల్ ఛాసిస్‌పై నిర్మించిన  'హై స్ట్రెంగ్త్ వెహికల్ బాడీ'తో రానుంది. తమ కాంపాక్ట్‌ కామెట్‌ దేశీయ పోర్ట్‌ఫోలియోలో అతి చిన్న వాహనమని, మార్కెట్లో విక్రయించే అతి చిన్న ఆల్-ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనం కూడా అవుతుందని కంపెనీ  భావిస్తోంది

ఏప్రిల్ 19న ఇండియాలో దీన్ని ఆవిష్కరించనుంది. కామెట్‌ ఈవీ ధరలను రాబోయే రెండు నెలల్లో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అయితే 17.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానున్న ఎంజీ కామెట్ ధర దాదాపు రూ. 10 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఫన్-టు-డ్రైవ్ ఎలిమెంట్స్‌తో అర్బన్‌ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా కాంపాక్ట్ స్మార్ట్  ఈవీ కామెట్‌ను లాంచ్‌ చేయనున్నామని మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు బాలేంద్రన్ వెల్లడించారు.ఇటీవలి నీల్సన్ నిర్వహించిన అర్బన్ మొబిలిటీ హ్యాపీనెస్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఈవీలకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. కామెట్ ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ (IoV), మల్టీమీడియా, కనెక్టెడ్‌  ఫీచర్లతో సహా GSEV ప్లాట్‌ఫారమ్‌ను పూర్తి చేసే వివిధ స్మార్ట్ ఫీచర్లున్నాయని కంపెనీ తెలిపింది. 

కాగా లాంచింగ్‌కుముందు కంపెనీ విడుదల టీజర్‌ ప్రకారం డ్యూయల్ 10.25-ఇంచ్ డిజిటల్ స్క్రీన్, స్టీరింగ్ వీల్ డిజైన్‌తో పాటు డాష్‌బోర్డ్‌, స్టీరింగ్ రెండు వైపులా మౌంటెడ్‌ రెండు-స్పోక్ డిజైన్స్‌, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, క్యాబిన్‌లో బాక్సీ డిజైన్‌ ఎల్‌ఈడీహెడ్‌లైట్‌లు ,టెయిల్ లైట్లు, యాంబియంట్ లైటింగ్ మొదలైని ఇతర ఫీచర్లుగాఉండనున్నాయి.  అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగానూ, అలాగే  టియాగో ఈవీ,  CitroeneC3 కంటే చిన్నదిగా ఉండనుందని అంచనా. 
 

మరిన్ని వార్తలు