హైదరాబాద్‌లో ఎంజీ మోటార్స్‌ సర్వీస్‌ సెంటర్‌ ప్రారంభం!

13 May, 2022 19:58 IST|Sakshi

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ ఎంజీ మోటార్ హైదరాబాద్‌లో సరికొత్త సర్వీస్ సెంటర్ ప్రారంభించింది. ఈ సర్వీస్‌ సెంటర్‌ మంత్రి పువ్వాడ అజయ్‌ ప్రారంభించారు. నగరంలో కస్టమర్‌ల మొబిలిటీ అవసరాలను తీర్చడానికే ఈ సర్వీస్ సెంటర్ను ప్రారంభించినట్లు ఎంజీ మోటార్స్‌ ప్రతినిధులు తెలిపారు. 

ఇక ఎంజీ మోటార్స్‌ దేశ వ్యాప్తంగా 310 టచ్‌ పాయింట్‌ కేంద్రాలు ఉండగా..తెలంగాణలో 13టచ్‌పాయింట్‌లను నిర్వహిస్తుంది. 2022 చివరి నాటికి రాష్ట్రంలో 18 టచ్‌పాయింట్‌లకు విస్తరించాలని యోచిస్తుంది.

ఈ సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా మార్కెటింగ్ హెడ్ ఉదిత్ మల్హోత్రా మాట్లాడుతూ అత్తాపూర్ లో ఎంజీ మోటార్స్‌ సర్వీస్‌ సెంటర్‌ ప్రారంభంతో తన ఉనికిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు చేరువయ్యే ప్రణాళికలకు అనుగుణంగా ఉందన్నారు. తద్వారా  ఈ సదుపాయం సర్వీసు, విడి భాగాలతో పాటు ఇతర అవసరాలను అందిస్తుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు