MHADA’s Mumbai Lottery: 4,082 ఇళ్లకు 23 వేలకు పైగా అప్లికేషన్లు

5 Jun, 2023 21:33 IST|Sakshi

మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (MHADA) ముంబైలో వివిధ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో అపార్ట్‌మెంట్‌లను అందిస్తోంది. ఇందు కోసం లాటరీ నిర్వహించి ఫ్లాట్‌లను కేటాయించనుంది. ఈ ఇళ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

23 వేలకు పైగా దరఖాస్తులు
ఎంహెచ్‌ఏడీఏ మొత్తం 4,083 ఫ్లాట్‌లకు మే 21 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. వీటికి ఇప్పటివరకూ 23 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే 4,083 ఫ్లాట్‌లలో ఒకటి లిటిగేషన్‌లో ఉండటంతో దాన్ని జాబితా నుంచి తొలగించింది. దీంతో మొత్తం ఫ్లాట్‌ల సంఖ్య 4,082కు తగ్గింది.  లాటరీ జాబితా నుంచి తొలగించిన ఈ అపార్ట్‌మెంట్‌ ముంబైలోని దాదర్ ప్రాంతంలోని ఒక మధ్యతరగతి సమూహం (MIG) అపార్ట్‌మెంట్. దాదాపు 750 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. దీని విలువు రూ. 2 కోట్లకు పైగా ఉంటుంది. 

ధర రూ.24 లక్షల నుంచి రూ.7.57 కోట్లు
200 నుంచి 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ల ధర రూ.24 లక్షల నుంచి రూ.7.57 కోట్ల మధ్య ఉంటుంది . అమ్మకానికి ఉన్న 4,082 ఫ్లాట్‌లు ఆర్థికంగా వెనుకబడిన విభాగం (EWS), దిగువ ఆదాయ వర్గం (LIG), మధ్య ఆదాయ సమూహం (MIG), అధిక ఆదాయ సమూహం (HIG) వంటి వివిధ వర్గాల కోసం ఉద్దేశించారు. కాగా దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూన్ 26. లాటరీ ఫలితాలు జూలై 18న ప్రకటిస్తారు.

ఇదీ చదవండి: Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్‌ఎస్టేట్‌ ఏజెంట్‌! పరీక్ష రాసి మరీ..

మరిన్ని వార్తలు