షియోమీ న్యూ ఇయర్ 5జీ ఫోన్‌ ఇదే..!

31 Dec, 2020 18:49 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతదేశంలో ఎంఐ 10ఐ మొబైల్ ను జనవరి 5న తీసుకొస్తున్నట్లు షియోమీ ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ లో 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్నట్లు ప్రకటించారు. ఎంఐ 10ఐ రెడ్‌మి నోట్ 9 ప్రో గత నెల చైనాలో విడుదలైన 5జీ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్‌. "కొద్ది రోజుల్లో మేము ఎంఐ 10ఐ అని పిలువబడే మా సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఎంఐ బ్రాండ్ క్రింద విడుదల చేయబోతున్నాం" అని జైన్ దాదాపు ఒకటిన్నర నిమిషాల నిడివి గల వీడియోలో చెప్పారు. ఎంఐ 10ఐలో ఐ అంటే ఇండియా అని తెలిపారు. భారత వినియోగదారుల కోసం ఈ ఫోన్ ను ప్రత్యేకంగా రూపొందించినట్లు పేర్కొన్నారు.(చదవండి: వొడాఫోన్ ఐడియా బంపరాఫర్)

ఎంఐ 10ఐ ఫీచర్స్:
ఎంఐ 10ఐ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ఆమోఎల్ఈడి డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 750జీ ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఎంఐ 10ఐ రెండు వేర్వేరు వేరియంట్లలో 6జీబీ, 8జీబీ ర్యామ్ ఆప్షన్స్ + 128జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్ స్టాండర్డ్ గా ఉంటుందని భావిస్తున్నారు. దీనిలో 108 మెగాపిక్సల్ కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా, 2ఎంపీ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ముందుభాగంలో 16 మెగా పిక్సల్ కెమెరా తీసుకురానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ 4,820 ఎంఏహెచ్ నాన్-రీప్లేస్‌బుల్ లి-పాలిమర్ బ్యాటరీతో రోజంతా అద్భుతమైన బ్యాకప్‌ను అందిస్తుంది. దీనితో పాటు 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. నెట్‌వర్క్, కనెక్టివిటీ కోసం 4జీ వోల్టిఇ, వై-ఫై, మొబైల్ హాట్‌స్పాట్, వి5.0 బ్లూటూత్, ఎ-జిపిఎస్ విత్ గ్లోనాస్, ఎన్‌ఎఫ్‌సి మరియు టైప్-సి యుఎస్‌బి ఉన్నాయి. 
 

మరిన్ని వార్తలు