జనవరి 5న రానున్న "ఎంఐ 10ఐ"

22 Dec, 2020 17:40 IST|Sakshi

చైనా మొబైల్స్ సంస్థ షియోమీ మార్కెట్ లోకి మరో మొబైల్ ని తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఎంఐ 10 సిరీస్ లో భాగంగా ‘ఎంఐ 10ఐ’ పేరుతో వచ్చే మొబైల్ 2021 జనవరి 5న తీసుకువస్తున్నారు. ఇది క్వాడ్-కెమెరా సెటప్ తో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రానుంది. చైనాలో ఇటీవల విడుదల చేసిన నోట్ 9 ప్రో 5జీకి రీబ్రాండెడ్ గా దీనిని తీసుకొస్తున్నట్లు సమాచారం. కానీ, ట్విటర్ లో ఈ మొబైల్ పేరును మాత్రం షియోమీ వెల్లడించలేదు. ఎంఐ 10 సిరీస్ లో భాగంగా ఎంఐ 10 ప్రో, ఎంఐ 10 లైట్, ఎంఐ 10 అల్ట్రా, ఎంఐ 10 లైట్ జూమ్ మొబైల్స్ తీసుకురానున్నట్లు సమాచారం.(చదవండి: ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ ఇవే!


ఎంఐ 10ఐ ఇటీవల గీక్‌బెంచ్‌లో మోడల్ నంబర్ M2007J17Iతో కనిపించింది. గీక్‌బెంచ్‌లో వెబ్‌సైట్‌లో వెలువడిన వివరాల ప్రకారం షియోమీ తీసుకురాబోయే ఫోన్ 8జీబీ ర్యామ్ తో రానుంది. ఈ ఫోన్ గీక్‌బెంచ్‌లో సింగిల్-కోర్ స్కోరు 652, మల్టీ-కోర్ స్కోరు 2,004ను పొందింది. ఇది ఔట్ అఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11తో రానున్నట్లు సమాచారం. క్వాడ్ కెమెరా సెటప్‌లో భాగంగా 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉండనున్నాయి. ఎంఐ 10ఐలో సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 4,820 ఎంఏహెచ్ బ్యాటరీ రానుంది. ఎంఐ 10ఐ 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్ప్లే కలిగి ఉండనుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 750 ప్రాసెసర్ తీసుకురానున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు