ఆన్‌లైన్‌లో ఎంఐ 11 లైట్ ఫీచర్స్ వైరల్

20 Jun, 2021 19:48 IST|Sakshi

షియోమీ జూన్ 22న భారతదేశంలో తీసుకొని వస్తున్న ఎంఐ 11 లైట్ ఫీచర్స్ ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో ఇది కొనుగోలుకు రానుంది. ఎంఐ 11 లైట్ మూడు రంగుల్లో అందించనున్నట్లు షియోమీ ఇటీవల ప్రకటించింది. ఎంఐ 11 లైట్ ఇప్పటికే 2021 స్లిమ్మింగ్, తేలికైన స్మార్ట్ ఫోన్ గా దృవీకరించారు. షియోమీ ఎంఐ 11 లైట్ ధర రూ.25,000 కంటే తక్కువగా తీసుకొస్తారని సమాచారం. ఫోన్ బేస్ వేరియెంట్ ధర రూ.20,000 ఉండవచ్చు. ఎంఐ 11 లైట్ వన్ ప్లస్ నార్డ్ సీఈ 5జీ, ఐక్యూఓయూ జెడ్3, ఇతర ఫోన్ లతో పోటీ పడనుంది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఎంఐ 11 లైట్ ఫీచర్స్ ఈ క్రింది విదంగా ఉన్నాయి.

ఎంఐ 11 లైట్ ఫీచర్స్: 

  • 6.5 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ అమోల్డ్ డిస్ ప్లే, 
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు 
  • క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్
  • 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా,
  • 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ లెన్స్, 
  • 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 
  • 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ,
  • 33వాట్ రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీ, 
  • 4,250 ఎమ్ఎహెచ్ బ్యాటరీ

చదవండి: Revolt RV400: రెండు గంటల్లో బుకింగ్స్ క్లోజ్.. స్పెషల్ ఏంటి? 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు