వచ్చేసింది..ఎంఐ 11లైట్‌.. ప్రీ ఆర్డర్‌పై భారీ తగ్గింపు..!

22 Jun, 2021 22:16 IST|Sakshi

ముంబై: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి ఎంఐ 11 లైట్‌ను జూన్‌ 22న లాంచ్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంఐ 11 లైట్‌ మార్చిలోనే విడుదల కాగా భారత్‌లో జూన్‌ 28 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. భారత్‌లో ఎంఐ 11 లైట్‌ 6జీబీ, 8 జీబీ వేరియంట్లలో రానుంది. కాగా ఎంఐ 11లైట్‌ (6జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజీ) రూ. 21, 999 లభించనుంది. (8జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజీ) వేరియంట్‌ రూ. 23, 999 కు లభిస్తోంది.  

ఎంఐ 11 లైట్‌ జాజ్‌ బ్లూ, ట్యూస్కానీ కోరల్‌, వినైల్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్లతో రానుంది. ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా షావోమీ చెబుతుంది. ఎంఐ 11 లైట్‌ బరువు కేవలం 157 గ్రాములు మాత్రమే. కాగా ఈ ఫోన్‌ 6.8 ఎమ్‌ఎమ్‌ థిక్‌నెస్‌ను కల్గి ఉంది. తాజాగా ఎంఐ 11లైట్‌ను ప్రీ ఆర్డర్‌ చేస్తే రూ. 1,500 ఎర్లీ బర్డ్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డ్‌ను ఉపయోగించే వారికి రూ.1,500 డిస్కౌంట్‌ అదనంగా లభిస్తోంది.

ఎంఐ లైట్‌ 6జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజీ వేరియంట్‌ రూ. 18, 999 ధరకు, 8జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ. 20,999 ధరకు అందించనుంది. ఎంఐ 11 లైట్‌ ఫోన్‌ను ఫ్లిప్‌ కార్డులో, ఎంఐ స్టోర్‌లో జూన్‌ 25న  ప్రీ ఆర్డర్‌ చేసుకోవచ్చును. ఎంఐ 11 లైట్‌ తొలి సేల్‌ జూన్‌ 28 నుంచి ప్రారంభంకానుంది.  

ఎంఐ 11 లైట్ ఫీచర్స్: 

6.55 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ అమోల్డ్ డిస్ ప్లే, 
90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు 
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్
64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా,
8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ లెన్స్, 
5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 
16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ,
33వాట్ రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీ, 
4,250 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
 

చదవండి: Xiaomi : స్మార్ట్‌వాచ్‌పై భారీ తగ్గింపు..!

మరిన్ని వార్తలు