షావోమి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు, కళ్లు చెదిరే ఎంఐ టీవీ

23 Apr, 2021 17:50 IST|Sakshi

ఎంఐ 11 సిరీస్‌లో మూడు అద్భుత స్మార్ట్‌ఫోన్లు

ఎంఐ  క్యూఎల్‌ఇడి టీవీ 75

సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం  షావోమీ మరో మూడు స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది.  ఇప్పటికే భారత మార్కెట్లో రారాజులా వెలుగొందుతున్న షావోమీ తాజాగా అత్యంత సమర్థవంతమైన ఫ్లాగ్‌షిప్ ఎంఐ 11 సిరీస్‌లో ఎంఐ 11 అల్ట్రా ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో మోడల్స్‌ని వర్చువల్ ఈవెంట్ ద్వారా  భారత మార్కెట్లో  లాంచ్‌ చేసింది.   ఇప్పటికే వీటిని చైనాలో రిలీజ్ చేసింది.  వివిధ డెబిట్, క్రెడిట్ కార్డులపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా అందిస్తోంది.  

అంతేకాదు  ఎంఐ  క్యూఎల్‌ఇడి టీవీ 75ను  కూడా లాంచ్‌ చేసింది.  దీని ధర 119,999 రూపాయలు ( 1,600 డాలర్లు)  ఏప్రిల్ 27  మధ్యాహ్నం 12 గంటలకు తొలిసేల్‌ ఉంటుంది. 

6జీబీ+128జీబీ,  8జీబీ+128జీబీ  వేరియంట్లలో ఎంఐ 11ఎక్స్‌ను తీసుకొచ్చింది.
వీటి ధరలు  రూ.29,999. రూ.31,999 గా నిర్ణయించింది.  మొదటి సేల్ ఏప్రిల్ 27న ప్రారంభమవుతుంది. 

ఎంఐ 11 అల్ట్రా  12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.69,990


ఎంఐ 11ఎక్స్ ప్రోను రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది.  8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.39,990 కాగా, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.41,999.
 అమెజాన్‌తో పాటు షావోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో కొనొచ్చు.  ఏప్రిల్‌ 24 నుంచి సేల్స్ మొదలు .  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు