Mi 11 Ultra: ఎంఐ 11 అల్ట్రా సేల్ మరింత ఆలస్యం

2 Jun, 2021 20:42 IST|Sakshi

షియోమీ ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 23న విడుదల అయిన సంగతి తెలిసిందే. అదే రోజున ఎంఐ 11 సిరీస్‌లో ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో మోడల్స్‌ని కూడా పరిచయం చేసింది షియోమీ. ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్‌ఫోన్స్ సేల్ మొదలైన ఎంఐ 11 అల్‌ట్రా సేల్ ఇంకా మొదలుకాలేదు. ఎంఐ 11 అల్‌ట్రా స్మార్ట్‌ఫోన్ విడుదల అయ్యి చాలా రోజులు గడిచిపోయిన సేల్ జరగకపోవడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. షియోమీ ఇండియాలో ఎంఐ 11 అల్‌ట్రా స్మార్ట్‌ఫోన్లను ఎందుకు సేల్ కు తీసుకురావట్లేదనే చర్చ జరుగుతుంది. 

షియోమీ అభిమానులు కూడా ఎంఐ 11 అల్‌ట్రా సేల్ ఎప్పుడు ఉంటుందంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ అయోమయానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సంస్థ క్లారిటీ ఇచ్చింది. తమ కంట్రోల్‌లో లేని అనివార్య పరిస్థితుల కారణంగా ఎంఐ 11 అల్‌ట్రా షిప్‌మెంట్ ఆలస్యం జరుగుతుందని, వీలైనంత త్వరగా సేల్ తేదీలను ప్రకటిస్తామని ట్విట్టర్‌లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ల కారణంగా షియోమీ సరఫరా, ఉత్పత్తి ఇబ్బందులను ఎదుర్కొంటుంది అని తెలుస్తుంది.

ఎంఐ 11 అల్ట్రా ఫీచర్స్:

  • 6.81 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్‌డీ+ ఈ4 అమొలెడ్ డిస్‌ప్లే
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ 
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ 
  • 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా  
  • 48 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ కెమెరా 
  • 48 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్ రియర్ కెమెరా 
  • 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 
  • 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 
  • 67వాట్ ఫాస్ట్ వైర్‌లెస్, వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ 
  • 10వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్  
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ 
  • 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.69,990.

చదవండి: కేవలం వారంలో భారీగా పెరిగిన ముకేశ్ అంబానీ సంప‌ద

మరిన్ని వార్తలు