48 ఎంపీ కెమెరాతో కొత్త టీవీ లాంచ్ చేసిన ఎంఐ

29 Jun, 2021 16:55 IST|Sakshi

షియోమీ చైనాలో ఎంఐ టీవీ 6 ఎక్స్ ట్రీమ్ ఎడిషన్, ఎంఐ టీవీ ఈఎస్ 2022 స్మార్ట్ టీవీలను లాంఛ్ చేసింది. రెండు టీవీలు విభిన్న ఫీచర్లతో వచ్చాయి.  ఎంఐ టీవీ 6 ఎక్స్ ట్రీమ్ ఎడిషన్ మీడియాటెక్ MT9950 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 3డీ ఎల్ యుటీ ఫిల్మ్ ఇండస్ట్రియల్ గ్రేడ్ కలర్ కరెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంది. దీని ముందు భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 48 మెగాపీక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. మరోవైపు, ఎంఐ టీవీ ఈఎస్ 2022 మీడియాటెక్ ఎమ్ టి9638 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. రెండు టీవీలు బెటర్ కాంట్రాస్ట్, పిక్చర్ క్వాలిటీ కొరకు మల్టీ జోన్ బ్యాక్ లైట్ సిస్టమ్ ని కలిగి ఉన్నాయి.

ఈ కొత్త ఎంఐ టీవీ 6 ఎక్స్ ట్రీమ్ ఎడిషన్ 55 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 5,999(సుమారు రూ.68,900), 65 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 7,999(సుమారు రూ.91,900), ఇక 75 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 9,999 (సుమారు రూ.1,14,800)గా ఉంది. మరోవైపు, ఎంఐ టీవీ ఈఎస్ 2022 55 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 3,399(సుమారు రూ.39,000), 65 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 4,399(సుమారు రూ.50,500), 75 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 5,999 (సుమారు రూ.68,900)గా ఉంది. ఈ రెండు స్మార్ట్ టీవీలు అధికారికంగా జూలై 9న మార్కెట్లోకి రానున్నాయి. ఎంఐ.కామ్ లో ఇప్పటికే ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.

చదవండి: Gravton Quanta EV: రూ.80కే.. 800 కిలోమీటర్లు ప్రయాణం

మరిన్ని వార్తలు