మైక్రోసాఫ్ట్‌ ఏఐ ఇన్నోవేట్‌

21 Oct, 2021 06:08 IST|Sakshi

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌  తాజాగా ఏఐ ఇన్నోవేట్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆర్టీఫీషీయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగంలో ఉన్న స్టార్టప్స్‌ కార్యకలాపాలను విస్తృతం చేయడం, ఆవిష్కరణలను నడిపించడంతోపాటు పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది. నవంబర్‌లో ప్రారంభమై 10 వారాలపాటు ఇది సాగనుంది. ఏఐ రంగంలో స్టార్టప్స్‌ సంఖ్య పరంగా ప్రపంచంలో భారత్‌ మూడవ స్థానంలో ఉందని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. ఏఐ వినియోగం ద్వారా 2035 నాటికి భారత ఆర్దిక వ్యవస్థకు రూ.6,75,000 కోట్లకుపైగా తోడవుతుందని మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి వెల్లడించారు.

మరిన్ని వార్తలు