Microsoft: జుకర్‌ బర్గ్‌పై మరో పిడుగు..!ఈ సారి మైక్రోసాఫ్ట్‌ రూపంలో..!

3 Nov, 2021 16:45 IST|Sakshi

ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌ బర్గ్‌కు మైక్రోసాఫ్ట్‌ నుంచి మరో ఎదురు దెబ్బ తగలనుంది. ఇప్పటికే  జుకర్‌ బర్గ్‌  కొత్త టెక్నాలజీ మెటావర్స్‌ పై పనిచేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మైక్రోసాఫ్ట్‌ సైతం ఈ మెటావర్స్‌ పై పనిచేస్తున్నట్లు ప్రకటించింది. ఈ టెక్నాలజీని ఫేస్‌బుక్‌ కంటే తామే ముందుగా ప్రపంచానికి పరిచయం చేస్తామని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది.

జూకర్‌ బర్గ్‌.. నువ్వు దిగిపో


గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామలతో జుకర్‌ బర్గ్‌కు డౌన్‌ ఫాల్‌ స్టార్ట్‌ అయ్యిందని, ప్రస్తుతం ఆయనకు ఎదురవుతున్న సమస్యలపై టెక్‌ నిపుణులు చెబుతున్న మాట. నిన్న ఫేస్‌బుక్‌ సీఈఓగా పనికి రాడని, ఆ పదవి నుంచి దిగిపోవాలని ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్‌ హాగెన్‌ వ్యాఖ్యానించింది. లేదంటే ఫేస్‌బుక్‌ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో ఫేస్‌బుక్‌ పేరును మెటాగా మార్చడంతో అదికాస్త వివాదం అయ్యింది. జుకర్‌ వాడిన 'మెటా' లోగో తమదేనంటూ జర్మనికి చెందిన 'ఎం-సెన్స్ Migräne' ట్వీట్‌ చేసింది. లోగో, ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ లోగో ఒకేవిధంగా ఉన్నాయంటూ ట్వీట్‌లో పేర్కొంది. అది సర‍్ధుమణిగే లోపే తాజాగా టెక్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ మెటావర్స్‌ పై వర్క్‌ చేస్తున్నట్లు  తెలిపింది. దీంతో జుకర్‌కు మరో ఎదురు దెబ్బతగిలినట్లైంది. అయితే ఈ మెటావర్స్‌ టెక్నాలజీ  మైక్రోసాఫ్ట్‌ కోసం కాదని వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), అగ‍్మెంటెడ్‌ రియాలిటీ(ఏఆర్‌), మిక్స్‌డ్‌ రియాలిటీ( ఎంఆర్‌)లను ఒకే ఫ్లాట్‌ ఫాం మీదికి తెచ్చే 'మైక్రోసాఫ్ట్‌ మెష్‌' కోసం అని చెప్పింది. 

మైక్రోసాఫ్ట్‌ మెష్‌ అంటే 


కరోనా కారణంగా ఈ 'వీఆర్‌, ఏఆర్‌, ఎంఆర్‌' టెక్నాలజీ వినియోగం బాగా పెరిగిపోయింది. అందుకే ఈ వర్చువల్‌ టెక్నాలజీపై వర్క్‌ చేస్తున్న మైక్రోసాఫ్ట్‌..ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌ మెష్‌ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో వినియోగించేందుకు మెటావర్స్‌ ను బిల్డ్‌ చేస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాదిలో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నట్లు వెల్లడించింది. 

మెటావర్స్‌ అంటే 


మెటావర్స్‌ అంటే ఇదొక వర్చువల్‌ రియాలిటీ. వర్క్‌ ఫ్రం హోంలో బిజీగా ఉన్న ఉద్యోగులు ఆఫీస్‌లో జరిగే మీటింగ్‌లకు హాజరు కాలేరు. అదే ఈ మెటావర్స్‌ టెక్నాలజీతో ఎక్కడ ఉన్నా..2డీ, త్రీడీ అవతార్‌ ఆకారాల్లో ఆఫీస్‌లో జరిగే మీటింగ్‌కు అటెండ్‌ అయ్యామనే అనుభూతిని కల్పిస్తుంది. కరోనా లాక్‌ డౌన్‌ టైమ్‌లో ఈ టెక్నాలజీని ఫేస్‌బుక్‌ ఇంటర్నల్‌గా జరిగే మీటింగ్‌లలో వినియోగించింది. దీన్ని పూర్తి స్థాయిలో ప్రపంచానికి అందించేందుకు 'మెటా' పేరుతో ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌ పనిచేస్తుండగా..మైక్రోసాఫ్ట్‌ సైతం ఈ మెటావర్స్‌ పై వర్క్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వరుస వివాదాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జుకర్‌కు మైక్రోసాఫ్ట్‌ తీసుకున్న నిర్ణయం ఎన్ని తలనొప్పులు తెచ్చిపెడుతుందోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

చదవండి: 'ఐ కాంట్‌ బ్రీత్‌':ఫేస్‌బుక్‌ కు మరో ముప్పు..జూకర్‌ ఏం చేస్తారో?

మరిన్ని వార్తలు