గుడ్‌న్యూస్‌..వారికోసం మైక్రోసాఫ్ట్‌ ప్రత్యేక ప్రోగ్రాం

21 Apr, 2022 08:50 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్టార్టప్స్‌కు మద్దతుగా నిలిచేందుకు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ రెండు కార్యక్రమాలను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్‌ ఏఐ ఇన్నోవేట్‌ రెండవ ఎడిషన్‌లో భాగంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతిక ఆధారంగా పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ స్టార్టప్స్‌ నుంచి నామినేషన్లను ఆహ్వానిస్తోంది.

10 వారాల కార్యక్రమంలో భాగంగా  కార్యకలాపాల విస్తరణ, ఆవిష్కరణలకు ఊతం, నైపుణ్యం పెంపునకు మైక్రోసాఫ్ట్‌ సాయం చేస్తుంది. అలాగే మైక్రోసాఫ్ట్‌ అజూర్‌పై పనిచేస్తున్న స్టార్టప్స్‌ తమ ఆలోచనలు ప్రోటోటైప్‌గా మళ్లేందుకు తోడ్పాటు అందిస్తారు. ఇందుకోసం టెక్‌గిగ్‌తో కలిసి హ్యాకథాన్‌ నిర్వహిస్తారు.  

చదవండి: షాకింగ్‌..రిలయన్స్‌కు గట్టి దెబ్బ..! గత ఏడాది కంటే తక్కువ..

మరిన్ని వార్తలు