ఇంట్లో కూర్చొని ‘మైక్రోసాఫ్ట్‌ కోసం పనిచేస్తుంది.. భారతీయ మహిళ బోకాలేపై సత్య నాదెళ్ల ప్రశంసల వర్షం

7 Feb, 2024 18:20 IST|Sakshi

సంక్షోభంలో అవకాశాల్ని వెతుక్కోవడం అనే మాట తరచూ వింటుంటాం. ఇప్పుడు ‘బేబీ రాజారాం బోకాలే’ లాంటి మహిళలు అదే కోవకు చెందుతారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వచ్చేసింది. మానువుల ఉద్యోగాల్ని భర్తీ చేస్తుందంటూ నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రపంచ కార్మిక రంగంలో అనిశ్చితి నెలకొంది. పైగా టెక్‌ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడం ఉద్యోగులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. 

ఈ నేపథ్యంలో మహరాష్ట్రలోని ఖరాడి సబర్బ్‌కు చెందిన 53 ఏళ్ల బేబీ రాజారాం బోకాలే మాత్రం కొత్త అవకాశాల్ని సృష్టించుకుంటుంది. నిన్న మొన్నటి వరకు సాధారణ మహిళగా చిరు మసాలా దినుసుల వ్యాపారం చేస్తుండేది. కానీ మైక్రోసాఫ్ట్ అభివృద్ది చేస్తున్న ఏఐ టూల్స్‌కు మరాఠీ నేర్పుతుంది. ఇందుకు గాను ఆమె గంటకు సుమారు రూ. 400 సంపాదిస్తుంది. ఎన్ని గంటలు వర్క్‌ చేస్తే అన్నీ వందలు సంపాదిస్తున్నట్లు తెలిపింది.    

ఇందంతా ఆమె ఇంట్లో కూర్చొనే పనిచేస్తున్నట్లు ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల సైతం తమ ఏఐ టూల్స్‌ కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. 


 
ఇంతకి ఆమె ఏం పని చేస్తుందో తెలుసా? 
ఇంట్లో కూర్చొని తన స్మార్ట్‌ఫోన్‌లో మైక్రోసాఫ్ట్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి మహరాష్ట్ర మాతృభాష మరాఠాలో కదలని చదువుతుందని’ అని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా బోకాలే మాట్లాడుతూ.. ‘నా వాయిస్ రికార్డ్ చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఇప్పుడు ఎవరైనా నా వాయిస్‌తో మరాఠీ నేర్చుకోవచ్చు. అంతేకాదు మైక్రోసాఫ్ట్‌ తయారు చేస్తున్న ఏఐ టూల్స్‌ను మరాఠాలో తన వాయిస్‌తో అందుబాటులోకి తెస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు. 

మైక్రోసాఫ్ట్‌ ఏఐ టూల్స్‌కి 
ఏఐ టూల్స్‌కి మరాఠా భాషలో బోకాలే బ్యాంకులు ఎలా పని చేస్తాయి? ఎలా పొదుపు చేయాలి? మోసాలను ఎలా నివారించాలి? ఇలా అనేక అంశాలను చదువుతుంది. ఆమె వాయిస్‌తోనే మైక్రోసాఫ్ట్‌ సృజనాత్మకతను జోడించి వినియోగ దారులకు అందిస్తుందని మైక్రోసాఫ్ట్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది. బోకాలేపై మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ మహిళలు మైక్రోసాఫ్ట్‌ అభివృద్ది చేస్తున్న ఏఐ టూల్స్‌కి సాయం చేస్తున్నారని ట్వీట్‌ చేశారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega