‘నా సీఈఓ పదవికే ఎసరు పెడతారా?’.. ఓపెన్‌ ఏఐలో మరో కీలక పరిణామం!

6 Jan, 2024 08:53 IST|Sakshi

చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓపెన్‌ ఏఐ సీఈఓ పదవి నుంచి తొలగించేందుకు కారణమైన బోర్డ్‌ సభ్యులపై చర్యలు తీసుకున్నారు. బోర్డ్‌లో కీలక మార్పులు చేర్పులు చేస్తున్నారు.

తాజాగా,మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ పార్టనర్‌ షిప్‌ అండ్‌ ఆపరేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహించే ‘డీ టెంపుల్టన్’ను శామ్‌ ఆల్ట్‌మన్‌ ఓపెన్‌ ఏఐ బోర్డులో నాన్-ఓటింగ్ అబ్జర్వర్‌ బాధ్యతలు అప్పగించారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక సైతం వెలుగులోకి వచ్చింది. 

ఇటీవల కాలంలో చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ వ్యాపార ప్రపచంలో చర్చాంశనీయంగా మారింది. సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ను బోర్డ్‌ సభ్యులు పదవి నుంచి అర్ధాంతరంగా తొలగించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుమారు 700 మంది ఉద్యోగులు రాజీనామా చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. 

ఆల్ట్‌మన్‌తో మైక్రోసాఫ్ట్‌ భేరసారాలు 
అదే సమయంలో ఓపెన్‌  ఏఐ ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ ఆఫర్‌ ఇవ్వడం, ఆల్ట్‌ మన్‌తో పాటు ఇతర ఉద్యోగుల్ని చేర్చుకునేందుకు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల సంపద్రింపులు జరపడం ఆసక్తికరంగా మారింది. అయితే , ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో ఆల్ట్‌మన్‌ తిరిగి ఓపెన్‌ ఏఐ సీఈఓగా మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ఓపెన్‌ ఏఐలోనూ సమస్య సద్దుమణిగింది.  

ఓపెన్‌ ఏఐ బోర్డ్‌లో మార్పులు
ఓపెన్‌ఏఐలో సీఈఓగా తిరిగి వచ్చిన తర్వాత, ఓపెన్‌ఏఐ బోర్డు మైక్రోసాఫ్ట్ నాన్-ఓటింగ్, అబ్జర్వర్ పొజిషన్‌ను తీసుకుంటుందని ఆల్ట్‌మన్ చెప్పారు. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న డీ టెంపుల్టన్ ఓపెన్‌ఏఐలో అబ్జర్వర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది.

అబ్జర్వర్‌గా టెంపుల్టన్‌
ఓపెన్‌ ఏఐలో అబ్జర్వర్‌గా బాధ్యతలు చేపట్టనున్న టెంపుల్టన్‌.. ఆ సంస్థ బోర్డ్‌ మీటింగ్‌తో పాటు, ఇతర అంతర‍్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం కలగనుంది. కానీ మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్‌ యాజమాన్యం ఏదైనా తీసుకునే నిర్ణయాలపై జరిగే ఓటింగ్‌లో పాల్గొనే హక్కు ఉండదు. దీంతో పాటు ఓటింగ్‌ నిర్వహించి డైరెక్టర్‌లను ఎంపిక చేసుకునే విధానంతో ఎలాంటి సంబంధం ఉండదు.   

25ఏళ్ల అనుభవం 
టెంపుల్టన్ మైక్రోసాఫ్ట్‌లో  25 ఏళ్లగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె ఇప్పటికే ఓపెన్‌ ఏఐ బోర్డు సమావేశాలకు హాజరవుతన్నట్లు నివేదికలు హైలెట్‌ చేశాయి.  

ఓపెన్‌ఏఐ బోర్డ్‌ సభ్యులు వీరే 
సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆల్ట్‌మన్‌లో బోర్డ్‌లో మార్పులు చేస్తున్నారు. తనని తొలగించిన డైరెక్టర్ల బోర్డును పాక్షికంగా పునర్నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు పాత బోర్డ్‌ సభ్యులు సైతం అంగీకరించారు. ఇప్పుడు వారి స్థానంలో సేల్స్‌ఫోర్స్ కో సీఈఓ బ్రెట్ టేలర్, మాజీ యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ లారీ సమ్మర్స్, క్వారా సీఈఓ, ప్రస్తుత డైరెక్టర్ ఆడమ్ డి ఏంజెల్‌లు ఓపెన్‌ఏఐతో చేతులు కలిపారు. బోర్డ్‌లో కార్యకలాపాలు నిర్వహించనున్నారు.

>
మరిన్ని వార్తలు