మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్!

9 Jul, 2021 15:51 IST|Sakshi

మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అంధించింది. ఈ కరోనా మహమ్మరి కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనడం వల్ల 1,500 డాలర్లు(రూ.1.12 లక్షలు) సింగిల్ టైమ్ బోనస్ గా ఇస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా కష్టాలతో గడిచిన ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఉద్యోగుల చేసిన కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, కాథ్లీన్ హొగన్ ఈ రోజు ఉద్యోగులకు ఈ సింగిల్ టైమ్ బోనస్ ను ప్రకటించారు. ఈ బోనస్ యుఎస్, అంతర్జాతీయంగా అర్హులైన ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. 

ఈ బోనస్ మార్చి 31, 2021కు ముందు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి దిగువన ఉన్న సిబ్బంది అందరికీ బహుమతిగా అందించింది. ఇందులో పార్ట్ టైమ్ వర్కర్లు కూడా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1,75,508 మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థలైన లింక్డ్ ఇన్, గిట్ హబ్, జెనిమాక్స్ ఉద్యోగులకు ఈ బోనస్ కు అర్హులు కాదు. ఈ బోనస్ కోసం సుమారు $200 మిలియన్ల డాలర్లు కేటాయించినట్లు సంస్థ పేర్కొంది. ఇంతక ముందు ఫేస్‌బుక్ తన 45,000 ఉద్యోగులకు ఒక్కొక్కరికి $1,000 బహుమతిగా ఇవ్వగా, అమెజాన్ ఫ్రంట్ లైన్ కార్మికులకు $300 సెలవు బోనస్, బీటీ గ్రూప్ తన 60,000 ఉద్యోగులకు £1,500(సుమారు $2,000) బహుమతిగా ఇచ్చింది.

మరిన్ని వార్తలు