రెండు కోట్లకుపైగా ఇస్తాం..వారికి బంపరాఫర్‌ ప్రకటించిన మైక్రోసాఫ్ట్‌..!

1 Apr, 2022 07:28 IST|Sakshi

స్టార్టప్‌ల కోసం మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్స్‌ హబ్‌ ప్లాట్‌ఫామ్‌ 

న్యూఢిల్లీ: అంకుర సంస్థల వ్యవస్థాపకులకు తోడ్పాటు అందించే దిశగా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ భారత్‌లో స్టార్టప్స్‌ ఫౌండర్స్‌ హబ్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా స్టార్టప్స్‌ వ్యవస్థాపకులకు టెక్నాలజీ, సాధనాలపరంగా 3,00,000 డాలర్ల పైగా విలువ చేసే ప్రయోజనాలను అందించనుంది.

అలాగే, అంకుర సంస్థలు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు పరిశ్రమ నిపుణులు, మైక్రోసాఫ్ట్‌ లెర్న్‌ నుంచి తోడ్పాటు లభించనుంది. ప్రారంభ దశలోని అంకుర సంస్థల కోసం ఈ హబ్‌ను రూపొందించినట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది.   

చదవండి: హల్‌చల్‌ చేస్తోన్న టాటా మోటార్స్‌ కొత్త ఎలక్ట్రిక్‌ కారు..! లాంచ్‌ ఎప్పుడంటే..?

మరిన్ని వార్తలు