మైక్రోసాఫ్ట్‌ బిగ్‌ ప్లాన్స్‌ : భారీ కొనుగోలుకు సన్నాహాలు

24 Mar, 2021 12:55 IST|Sakshi

డిస్కార్డ్ సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు

ప్రజలకు మరింత చేరువయ్యేందుకే...!

వాషింగ్టన్‌: ప్రముఖ మెసేజింగ్ సైట్ డిస్కార్డ్ ను సొంతం చేసుకునేందుకు  మైక్రోసాఫ్ట్ పావులు కదుపుతోంది. డిస్కార్డ్ సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్‌  10 బిలియన్‌ డాలర్లతో డిస్కార్డ్‌ను కొనుగోలు చేయాలనుకుంటునట్లు సమాచారం. చాలా సంస్థలు డిస్కార్డ్ ను కొనేందుకు ప్రయత్నిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ ముందు వరుసలో ఉందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్‌ తెలిపింది. ఇరు కంపెనీల ప్రతినిధులు కొనుగోలు విషయంపై క్లారీటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ లింక్డ్ ఇన్, గిట్‌ హబ్‌, మైన్‌క్రాఫ్ట్‌ను కొనుగోలు చేసింది. ఈ వేదికలు కేవలం ప్రొఫెషనల్స్ కు మాత్రమే అందుబాటులో ఉండడంతో,  సాధారణ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ సోషల్ మీడియా సైట్ ను సొంతం చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.గతంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ  టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవాలకున్న, అది కుదరలేదు. ఈ నేపథ్యంలోనే డిస్కార్డ్ పై దృష్టి పెట్టింది.

డిస్కార్డ్ మెసేజింగ్‌ యాప్‌తో యూజర్లకు  వీడియో, వాయిస్, టెక్స్ట్ ద్వారా కమ్యూనికేట్ సేవలను అందిస్తుంది. ఈ యాప్‌ కరోనా మహమ్మారి సమయంలో అత్యంత ప్రజాదరణ పొందింది.100 మిలియన్లకు పైగా యూజర్లను  డిస్కార్డ్ కలిగి ఉంది.ప్రముఖ గేమింగ్‌ బ్రాండ్‌ ఎక్స్ బాక్స్ కు  రూపకల్పన చేసింది  డిస్కార్డే. గత ఏడాది డిసెంబరు వరకు కంపెనీ విలువ 7 బిలియన్ల డాలర్లకు చేరింది.అంతేకాకుండా దీనిని ఐపీవో కంపెనీగా మార్చాలని నిర్వహకులు భావిస్తున్నారు. గతంలో డిస్కార్డే ఏపిక్‌ గేమ్స్‌, అమెజాన్‌ కంపెనీలతో చర్చలు జరిపింది.

(చదవండి: గూగుల్‌పే, జీమెయిల్‌ క్రాష్‌ అవుతోందా? ఇలా చేయండి!)

మరిన్ని వార్తలు