విండోస్‌ 11పై మరో అప్‌ డేట్‌, క్రాక్‌ వెర్షన్‌లో ట్రై చేస్తున్నారా?

29 Jul, 2021 13:10 IST|Sakshi

విండోస్‌ 11పై మరో అప్‌ డేట్‌తో మైక్రోస్టాఫ్ట్‌ ముందుకు వచ్చింది. థర్డ్‌ పార్టీ టూల్స్‌ ద్వారా ఇన్‌ స్టాల్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న యూజర్లను హెచ్చరించింది. ఎవరైతే చీట్‌ చేసి విండోస్‌ను అప్‌ డేట్‌ చేస్తారో వారి సిస్టమ్‌ లలో విండోస్‌ పనిచేయదని, బ్లాక్‌ చేస్తామని తెలిపింది. 

మైక్రోసాఫ్ట్‌ జులై 25, 2015లో విండోస్‌ 10ను అప్‌డేట్‌ చేసింది. దాదాపూ 6ఏళ్ల తరువాత విండోస్‌11 ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఈ ఏడాది జూన్‌ నెలలో అధికారికంగా ప్రకటించింది. విండోస్‌ 11ను ఎప్పుడు రిలీజ్‌ చేస్తున్నారో డేట్‌ చెప్పకపోయినప్పటికి టెక్‌ నిపుణులు మాత్రం ఈ ఏడాది చివరిలో వస్తుందని అంచనా వేస్తున్నారు. 

ఈ విండోస్‌ -11 ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటే కావాల్సిన రిక్వైర్‌ మెంట్‌ను అనౌన్స్‌ చేసింది.1జీహెచ్‌జెడ్‌ ప్రాసెసర్‌ ,64బిట్‌ ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌, ట్రస్టెడ్‌ ఫ్లాట్‌ఫామ్‌ మోడల్‌ వెర్షన్‌ (టీపీఎం) 2.0, పనితీరు బాగుండేందుకు డైరెక్ట్‌ ఎక్స్‌12, డబ్ల్యూడీడీఎం 2.0 డ్రవైర్‌ కావాలని చెప్పింది.  

ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ సీనియర్‌ ప్రోగ్రాం మేనేజర్‌ అరియా కార్లే మాట్లాడుతూ.. విండోస్‌ 11 ఇన్‌స్టాల్‌ అవ్వాలంటే  ఈ ఫీచర్స్‌ ఉండాలని, లేదంటే విండోస్‌ 11ఇన్‌స్టాల్‌ అవ్వదని చెప్పారు. థర్ట్‌ పార్టీ ద్వారా ఇన్‌ స్టాల్‌ పనితీరు ఆగిపోతుందని స్పష్టం చేశారు.  
 

మరిన్ని వార్తలు