మార్కెట్లు అప్‌- ఈ చిన్న షేర్లు ధూమ్‌ధామ్‌

8 Sep, 2020 14:05 IST|Sakshi

సెన్సెక్స్‌ 215 పాయింట్లు ప్లస్‌- 38,632కు

ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు డిమాండ్‌

ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 52 వారాల గరిష్టాలకు పలు కౌంటర్లు

జాబితాలో పనాసియా బయోటెక్‌, సన్‌ ఫార్మా అడ్వాన్స్‌డ్‌(స్పార్క్‌)

హ్యాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌, గుజరాత్‌ అపోలో ఇండస్ట్రీస్‌, సెంచురీ ఎంకా

ఊగిసలాట మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 215 పాయింట్లు జంప్‌చేసి 38,632ను అధిగమించగా.. నిఫ్టీ 62 పాయింట్లు ఎగసి 11,418 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లు ఏడాది గరిష్టాలను తాకగా.. ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో గుజరాత్‌ అపోలో ఇండస్ట్రీస్‌, సెంచురీ ఎంకా లిమిటెడ్‌, పనాసియా బయోటెక్‌, సన్‌ ఫార్మా అడ్వాన్స్‌డ్‌(స్పార్క్‌), హ్యాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. 

హ్యాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం లాభపడి రూ. 794 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 809 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో  గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 5,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 9,500 షేర్లు చేతులు మారాయి.

సన్‌ ఫార్మా అడ్వాన్స్‌డ్‌ 
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం ర్యాలీ చేసి రూ. 186 వద్ద  ట్రేడవుతోంది. తొలుత రూ. 189 వరకూ ఎగసింది. ఇది ఏడాది గరిష్టంకావడం గమనార్హం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 93,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 78,000 షేర్లు చేతులు మారాయి.

పనాసియా బయోటెక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 199 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 211 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 23,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 71,000 షేర్లు చేతులు మారాయి.

గుజరాత్‌ అపోలో ఇండస్ట్రీస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం జంప్‌చేసి రూ. 233 వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడాది గరిష్టంకావడం గమనార్హం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 7,200 షేర్లు చేతులు మారాయి.

సెంచురీ ఎంకా లిమిటెడ్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం ఎగసి రూ. 184 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 187 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 9,600 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో ఏకంగా 19,500 షేర్లు చేతులు మారాయి.

మరిన్ని వార్తలు