ఆటుపోట్లలోనూ ఈ చిన్న షేర్లు జూమ్‌

29 Sep, 2020 13:21 IST|Sakshi

స్వల్ప నష్టాలతో కదులుతున్న మార్కెట్లు

మధ్య, చిన్నతరహా కంపెనీల షేర్లకు డిమాండ్

‌జాబితాలో డెల్టా కార్ప్‌, కజారియా సిరామిక్స్‌, అదానీ గ్రీన్‌

పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌, బ్లిస్‌ జీవీఎస్‌ ఫార్మా, గ్యూఫిక్‌ బయోసైన్స్‌

ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో మూడో రోజూ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం లాభాలు పోగొట్టుకుని స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. తద్వారా భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం ఊపందుకోగా.. కొన్నిటిలో తగ్గింది. జాబితాలో డెల్టా కార్ప్‌ లిమిటెడ్‌, కజారియా సిరామిక్స్‌, పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, బ్లిస్‌ జీవీఎస్‌ ఫార్మా, గ్యూఫిక్‌ బయోసైన్స్‌ చోటు సాధించాయి. ట్రేడింగ్‌ వివరాలు చూద్దాం..

డెల్టా కార్ప్‌ లిమిటెడ్‌ 
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6.5 శాతం జంప్‌చేసి రూ. 114 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.06 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.07 లక్షల షేర్లు చేతులు మారాయి.

కజారియా సిరామిక్స్‌ 
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.6 శాతం దూసుకెళ్లి రూ. 550 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 556 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో  గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 48,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 21,000 షేర్లు చేతులు మారాయి.

పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.4 శాతం ర్యాలీ చేసి రూ. 107 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 63,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.34 లక్షల షేర్లు చేతులు మారాయి.

అదానీ గ్రీన్‌ ఎనర్జీ
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 714 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2.6 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 81,000 షేర్లు చేతులు మారాయి.

బ్లిస్‌ జీవీఎస్‌ ఫార్మా
బీఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 4.7 శాతం పెరిగి రూ. 160 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2.35 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.21 లక్షల షేర్లు చేతులు మారాయి.

గ్యూఫిక్‌ బయోసైన్సెస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం ఎగసి రూ. 91 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 96 వరకూ లాభపడింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 23,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.38 లక్షల షేర్లు చేతులు మారాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా