ఆటుపోట్లలోనూ ఈ చిన్న షేర్లు గెలాప్‌

2 Sep, 2020 13:23 IST|Sakshi

పలు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు భారీ డిమాండ్‌

ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో లాభాలతో పలు కౌంటర్లు కళకళ

జాబితాలో ఈక్లర్క్స్‌ సర్వీసెస్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌, టిప్స్‌ ఇండస్ట్రీస్‌

లా ఒపాలా ఆర్‌జీ, పాలీ మెడిక్యూర్‌, పంజాబ్‌ కెమికల్స్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకోగా.. మరికొన్ని కౌంటర్లలో నీరసించింది. జాబితాలో ఈక్లర్క్స్‌ సర్వీసెస్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌, టిప్స్‌ ఇండస్ట్రీస్‌, లా ఒపాలా ఆర్‌జీ, పాలీ మెడిక్యూర్‌, పంజాబ్‌ కెమికల్స్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. 

ఈక్లర్క్స్‌ సర్వీసెస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం జంప్‌ చేసింది. రూ. 726 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 745 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 19,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో కేవలం 1,500 షేర్లు చేతులు మారాయి.

యునైటెడ్‌ బ్రూవరీస్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం ర్యాలీ చేసి రూ. 1084 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 52,500  షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో  60,000 షేర్లు చేతులు మారాయి.

లా ఒపాలా ఆర్‌జీ
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం లాభపడి రూ. 213 వద్ద  ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 27,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 8,000 షేర్లు మాత్రమే చేతులు మారాయి.

పాలీ మెడిక్యూర్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం దూసుకెళ్లి రూ. 424 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 438 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 17,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో కేవలం 5,500 షేర్లు చేతులు మారాయి.

పంజాబ్‌ కెమికల్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం జంప్‌చేసి రూ. 609 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 629 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 4,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1,500 షేర్లు మాత్రమే చేతులు మారాయి.

టిప్స్‌ ఇండస్ట్రీస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 15 శాతం దూసుకెళ్లి రూ. 215 సమీపంలో ట్రేడవుతోంది. తొలుత రూ. 225 వరకూ ఎగసింది.  బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 5,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 14,000 షేర్లు చేతులు మారాయి.

మరిన్ని వార్తలు