సెన్సెక్స్‌ ట్రిపుల్‌- ఈ చిన్న షేర్లు హైజంప్‌

28 Aug, 2020 13:30 IST|Sakshi

310 పాయింట్లు జంప్‌చేసిన సెన్సెక్స్‌

పలు మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ లాభాల పరుగు

జాబితాలో ప్రెసిషన్‌ వైర్స్‌, కెనరా బ్యాంక్‌, టీబీజెడ్‌

శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, సందేష్‌ లిమిటెడ్‌

విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 310 పాయింట్లు జంప్‌చేసి 39,424కు చేరగా.. నిఫ్టీ 82 పాయింట్లు ఎగసి 11,641 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్లను మార్కెట్లను మించి భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, కెనరా బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, సందేష్‌ లిమిటెడ్‌, ప్రెసిషన్‌ వైర్స్‌, టీబీజెడ్‌ లిమిటెడ్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. 

శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.5 శాతం జంప్‌ చేసింది. రూ. 759 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 778 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2.6 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 2.24 లక్షల షేర్లు చేతులు మారాయి.

కెనరా బ్యాంక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం ర్యాలీ చేసి రూ. 112 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 5.8 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 11.7  లక్షల షేర్లు చేతులు మారాయి.

ఫెడరల్‌ బ్యాంక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం లాభపడి రూ. 60 వద్ద  ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 17.52 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 31 లక్షలకుపైగా షేర్లు చేతులు మారాయి.

సందేష్‌ లిమిటెడ్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10.5 శాతం దూసుకెళ్లి రూ. 583 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 633 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం కేవలం 350 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 3,500 షేర్లు చేతులు మారాయి.

ప్రెసిషన్‌ వైర్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 141 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 146 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 5,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 5,500 షేర్లు చేతులు మారాయి.

టీబీజెడ్‌ లిమిటెడ్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 43 సమీపంలో ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 30,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2 లక్షల షేర్లు చేతులు మారాయి.

మరిన్ని వార్తలు