ఈ ఐటీ షేర్ల సొగసు చూడతరమా?

8 Oct, 2020 14:52 IST|Sakshi

భారీ లాభాలతో ట్రేడవుతున్న మార్కెట్లు

మధ్య, చిన్నతరహా  ఐటీ కంపెనీలకు డిమాండ్‌

జాబితాలో మైండ్‌ట్రీ, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, ఎంఫసిస్‌

ఆల్‌సెక్‌ టెక్నాలజీస్‌, సైబర్‌టెక్‌ సిస్టమ్స్‌, తెరా సాఫ్ట్‌వేర్‌

తొలుత కనిపించిన ఆటుపోట్ల నుంచి బయటపడుతూ జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 303 పాయింట్లు జంప్‌చేసి 39,877ను తాకగా.. నిఫ్టీ 73 పాయింట్లు ఎగసి 11,735 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో మైండ్‌ట్రీ లిమిటెడ్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, ఎంఫసిస్‌, ఆల్‌సెక్‌ టెక్నాలజీస్‌, సైబర్‌టెక్‌ సిస్టమ్స్‌, తెరా సాఫ్ట్‌వేర్‌ చోటు సాధించాయి. ట్రేడింగ్‌ వివరాలు చూద్దాం..

మైండ్‌ట్రీ లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం దూసుకెళ్లి రూ. 1,469 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,590 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.11 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.25 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 2,809 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,959 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలో  గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 13,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 27,500 షేర్లు చేతులు మారాయి.

ఎంఫసిస్‌ లిమిటెడ్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం ర్యాలీ చేసి రూ. 1,414 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,454 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 16,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 62,000 షేర్లు చేతులు మారాయి.

ఆల్‌సెక్‌ టెక్నాలజీస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం లాభపడి రూ. 265 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 286 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం కేవలం 350 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2,000 షేర్లు చేతులు మారాయి.

తెరా సాఫ్ట్‌వేర్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం ఎగసి రూ. 29 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 8,000 షేర్లు చేతులు మారాయి.

సైబర్‌టెక్‌ సిస్టమ్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 14 శాతం జంప్‌చేసి రూ. 84 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 88 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 26,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.54 లక్షల షేర్లు చేతులు మారాయి.

మరిన్ని వార్తలు