మార్కెట్లు బేర్‌- ఈ చిన్న షేర్లు భేష్‌

4 Sep, 2020 13:12 IST|Sakshi

పలు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు డిమాండ్‌

ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో పలు కౌంటర్లు కళకళ

జాబితాలో ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌, ఆదిత్య బిర్లా కేపిటల్

‌స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌, జామ్నా ఆటో, ఫోర్స్‌ మోటార్స్‌

విదేశీ షాక్‌తో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం పతన బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 450 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లు చొప్పున కోల్పోయాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌, ఆదిత్య బిర్లా కేపిటల్‌, స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌, జామ్నా ఆటో ఇండస్ట్రీస్‌, ఫోర్స్‌ మోటార్స్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. 

 ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 15.5 శాతం దూసుకెళ్లి రూ. 558 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 573ను అధిగమించింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 19,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 54,500 షేర్లు చేతులు మారాయి.

జామ్నా ఆటో ఇండస్ట్రీస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 15 శాతం లాభపడి రూ. 51 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3.2 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 3.1 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఫోర్స్‌ మోటార్స్‌ 
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం ర్యాలీ చేసి రూ. 1,159 వద్ద  ట్రేడవుతోంది. తొలుత రూ. 1185 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 11,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 14,000 షేర్లు చేతులు మారాయి.

ఆదిత్య బిర్లా కేపిటల్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6.5 శాతం జంప్‌చేసి రూ. 76 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2.68 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో ఏకంగా 9.68 లక్షల షేర్లు చేతులు మారాయి.

స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం ఎగసి రూ. 273 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 286 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 36,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 50,000 షేర్లు చేతులు మారాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు