ఈ మిడ్‌ క్యాప్‌ షేర్లపై అమ్మకాల దెబ్బ

7 Sep, 2020 15:25 IST|Sakshi

ఆటుపోట్ల మార్కెట్లో పతన బాట

కొన్ని కౌంటర్లలో భారీ ట్రేడింగ్‌ పరిమాణం

జాబితాలో పలు ఫ్యూచర్‌ గ్రూప్‌ కౌంటర్లు

గుడ్‌ఇయర్‌ ఇండియా, ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌

ఆటుపోట్ల మధ్య కదులుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో కొన్ని మిడ్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. దీంతో ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లు లోయర్‌ సర్క్యూట్లను తాకగా.. ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌, గుడ్‌ఇయర్‌ ఇండియా.. పతన బాటలో సాగుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం పుంజుకోగా.. మరికొన్ని కౌంటర్లలో లావాదేవీలు నీరసించాయి. వివరాలు చూద్దాం..

ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం  పతనమై రూ. 525 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 23,500 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 25,000 షేర్లు చేతులు మారాయి.

గుడ్‌ఇయర్‌ ఇండియా
బీఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం కుప్పకూలి రూ. 943 దిగువన ట్రేడవుతోంది.  బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 6,000 షేర్లు కాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 36,000 షేర్లు చేతులు మారాయి.

ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం దిగజారి రూ. 121 దిగువన ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 66,000 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా కేవలం 10,000 షేర్లు చేతులు మారాయి.

ఫ్యూచర్‌ రిటైల్‌ 
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం క్షీణించి రూ. 107 దిగువన ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 19.75 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్‌లో 4.13 లక్షల షేర్లు మాత్రమే చేతులు మారాయి.

ఫ్యూచర్‌ కన్జూమర్‌ 
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం కోల్పోయి రూ. 10.40 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 54.45 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్‌లో 34.80 లక్షల షేర్లు మాత్రమే చేతులు మారాయి.

మరిన్ని వార్తలు