కేంద్ర బడ్జెట్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం..!

2 Feb, 2022 08:55 IST|Sakshi

న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు(ఫిబ్రవరి 1న) లోక్ సభలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. అయితే, ఈ బడ్జెట్‌లో ఆదాయపు పన్ను ప్రస్తుతం విధానంలో ఏదైనా మారుస్తారని అందరూ ఆశించారు. కానీ, ఈ విషయంలో బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదు. అలాగే, క్రిప్టో కరెన్సీ లాభాలపై కేంద్రం 30 శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించడంతో నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తమ అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా మీమ్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌ సందర్భంగా #Budget2022, #IncomeTax అనే ట్యాగ్స్ సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయ్యాయో.. మిడిల్ క్లాస్ అనే ట్యాగ్ అంతకంటే ఎక్కువగా ట్రెండ్ అయ్యింది.

సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న మీమ్స్ కూడా మీరు చూసేయండి. ఆదాయపన్ను శ్లాబులో ఎటువంటి మార్పులు లేకుండా యథాతథంగా ఉంచేయడంతో మధ్యతరగతి వర్గాలకు నిరాశ ఎదురైందంటూ బడ్జెట్‌పై సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంతోకూడిన పోస్టులు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఆదాయపన్ను గురించి పోస్టులు ట్విట్టర్‌లో బాగా వైరల్‌ అయ్యాయి. అయితే ఇంటర్నెట్‌లో మొత్తంగా ‘మధ్యతరగతి’వర్గాలు బడ్జెట్‌పై స్పందిస్తున్న పోస్టులు టాప్‌ ట్రెండింగ్‌గా నిలిచాయి. నవ్వు తెప్పించే విధంగా ఉన్న ఆ పోస్టుల్లో కొన్ని...

డాక్టర్‌ ప్రశాంత్‌ మిశ్రా తన ట్విట్టర్‌ నుంచి.. మధ్యతరగతి వారికి బడ్జెట్‌లో ఎటువంటి ప్రయోజనాలు లేకపోయినప్పటికీ ప్రతీఏటా ఆశగా ఎదురుచూడటం తప్పట్లేదు అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ ఫొటోను షేర్‌ చేశారు. 

ట్రెండూల్కర్‌ ట్విట్టర్‌ నుంచి ఆదాయపన్ను పరిమితి పెంపుపై ఇంటి బయటనుంచి లోపలికి ఆశగా ఎదురు చూస్తున్న
ఓ వ్యక్తి ఫొటోను షేర్‌ చేశారు. 

అమిత్‌ జూనియర్‌ అనే వ్యక్తి తన ట్విట్టర్‌లో ప్రతిఏటా బడ్జెట్‌ అనంతరం మధ్యతరగతి ప్రజల స్పందన ఇదేనంటూ నిరాశగా ఉన్న అక్షయ్‌కుమార్‌ ఫొటోను షేర్‌ చేశారు 

అరవింద్‌ అనే వ్యక్తి తన ట్విట్టర్‌లో బడ్జెట్‌ గురించి నిర్మలా సీతారామన్‌కు ఓ వేతనజీవి నేరుగా ఫోన్‌ చేసి సామాన్యుడంటే విలువలేకుండా పోయిందని వాపోతున్న ఫొటోను షేర్‌ చేశారు  

A post shared by Meme Raja (@meme_raaja)

A post shared by Chai Bisket (@chaibisket)

A post shared by Stock Market In Telugu (@stockmarkt_telugu)

A post shared by Stock Market In Telugu (@stockmarkt_telugu)

(చదవండి: PMAY: కొత్త ఇల్లు కొనేవారికి కేంద్రం శుభవార్త..!)

మరిన్ని వార్తలు