ఈ కంప్యూటర్‌ ధర కేవలం రూ. 1000 మాత్రమే..! దీని విశేషాలు ఇవే..!

29 Jan, 2022 09:39 IST|Sakshi

సాధారణంగా ఒక డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ ధర ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తాం..? సుమారు రూ. 15 వేల నుంచి 50 వేల వరకు ఉండే అవకాశం ఉంది. సదరు డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ కాన్ఫీగరేషన్‌ బట్టి ధర మారుతూ ఉంటుంది. కాగా బ్రియాన్‌ బెంచాఫ్‌ అనే ఒక డెవలపర్‌ కేవలం 15 డాలర్లకే(సుమారు రూ. 1000) (Minimum Viable Computer) కంప్యూటర్‌ను తయారు చేసి అందరితో ఔరా..! అన్పిస్తున్నాడు...అసలు ఈ కంప్యూటర్‌ ఎలా పనిచేస్తుంది..ఇతర విషయాల గురించి తెలుసుకుందాం..!

స్మార్ట్‌ఫోన్‌ సైజులో..!
బ్రియాన్‌ తయారుచేసిన మినీ పాకెట్‌ సైజ్‌ కంప్యూటర్‌ ఇంచుమించు స్మార్ట్‌ఫోన్‌ సైజులో ఉంటుంది. ఇది ఒక Linux ఆపరేటింగ్‌ సిస్టమ్‌.  దీనిలోని ఆల్విన్నర్ F1C100s సిస్టమ్-ఆన్-ఎ-చిప్‌తో అనుసంధానించబడిన సాధారణ రెండు-పొరల పవర్‌ కంట్రోల్‌ బోర్డ్‌ను  (పీసీబీ)ను ఉపయోగించారు. అంతేకాకుండా  సింగిల్ CPU కోర్ కేవలం 533MHz వద్ద క్లాక్ చేయబడింది. విశేషమేమిటంటే Linux కు చెందిన ఆధునిక సంస్కరణలను అమలు చేయడానికి మద్దతును కలిగి ఉంది.  ఇది స్క్రిప్ట్‌లను, పింగ్ రిమోట్ సర్వర్‌లను అమలు చేయగలదు. వివిధ రకాల USB పరికరాలతో ఆపరేట్‌ చేయవచ్చును. 


ఫీచర్స్‌లో కంప్యూటర్స్‌తో సమానంగా..!
బ్రియాన్‌ తయారుచేసిన ఈ లైనక్స్‌ కంప్యూటర్‌లో సాధారణ కంప్యూటర్‌లో ఉండే ఫీచర్స్‌ అన్ని ఉన్నాయి. 2.3-అంగుళాల డిస్ప్లేతో స్ప్లిట్ ఐదు-వరుసల ఆర్తోగోనల్ కీబోర్డ్‌ను కలిగి ఉంది. ఈ కంప్యూటర్‌ స్క్రీన్ 240 x 320 రిజల్యూషన్‌ను కలిగి ఉంది అంతేకాకుండా ఇది టచ్‌ను కూడా సపోర్ట్‌ చేయనుంది. దీనిలో AAA NiMH సెల్‌ను అమర్చాడు. ఇతర పెరిఫెరల్స్ కోసం ప్రామాణిక USB-A పోర్ట్ ఉంది.  


Wi-Fi అడాప్టర్, కీబోర్డ్,  ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌ డిస్క్‌ కోసం యుటిలిటీ మద్దతు ఇచ్చే ఏదైనా ప్లగ్ ఇన్ చేయవచ్చు. అయితే, పరికరాన్ని ఛార్జ్ చేయడానికి USB-C పోర్ట్‌ను ఉపయోగించాలి. ఈ కంప్యూటర్‌ను తయారుచేయడానికి బ్రియాన్‌ కేవలం 14.16 డాలర్లను మాత్రమే ఖర్చు చేశాడు. ఈ ప్రాజెక్టును రియాలిటీగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నానని ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఇతరుల సహాయంతో దీనిని మరింత తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుందని బ్రియాన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.  
 


చదవండి: మాస్కున్న ఫోన్‌ అన్‌లాక్‌ చేయవచ్చు..కేవలం వారికి మాత్రమే..!

మరిన్ని వార్తలు