Black Money In Foreign Accounts: విదేశాల్లోని నల్లధనంపై మా దగ్గర లెక్కల్లేవ్‌ - ప్రభుత్వ ప్రకటన

15 Dec, 2021 10:21 IST|Sakshi

గత ఐదేళ్లలో అధికారిక అంచనా లేదు 

ఫారిన్‌ అకౌంట్స్‌పై ప్రభుత్వం ప్రకటన   

న్యూఢిల్లీ: విదేశీ అకౌంట్లలో నల్లధనం ఎంతుందన్న విషయంలో గడచిన ఐదేళ్లలో అధికారిక అంచనాలు ఏవీ లేవని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి రాజ్యసభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. అయితే 2015లో మూడు నెలల వన్‌–టైమ్‌ సెటిల్‌మెంట్‌ విండో కింద రూ. 2,476 కోట్లు పన్ను, పెనాల్టీగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. 

నల్లధనం (బహిర్గతం కాని విదేశీ ఆదాయం–ఆస్తులు) పన్ను చట్టం, 2015 విధించడం కింద సెప్టెంబర్‌ 30, 2015తో ముగిసిన మూడు నెలల వన్‌ టైమ్‌ విండో కింద రూ. 4,164 కోట్ల విలువైన బహిర్గతం చేయని విదేశీ ఆస్తులు వెల్లడయినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన లావాదేవీల సంఖ్య 648 అని వివరించారు. 
 

మరిన్ని వార్తలు