ఝున్‌ఝున్‌వాలా అస్తమయంపై స్మృతి ఇరానీ ఏమన్నారంటే

14 Aug, 2022 14:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా  ఆకస్మిక మరణంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నివాళులు అర్పించారు. లెజండ్‌ ఎప్పటికీ జీవించే ఉంటారంటూ వరుస ట్వీట్లలో ఆయనను గుర్తు చేసుకుంటూ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గుండెపోటు కారణంగా  ఝున్‌ఝున్‌వాలా ఆదివారం ఉదయం  కన్నుమూసిన సంగతి తెలిసిందే.

(రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్‌ మూవీలు ఏవో తెలుసా?)

"ఈ రోజు నేను నా సోదరుడిని కోల్పోయాను.. చాలామందికి తెలియని బంధం మాది. అందరూ అతణ్ని  బిలియనీర్ ఇన్వెస్టర్ అని, బీఎస్‌ఈ బాద్షా అని పిలుస్తారు. కానీ  ఆయన ఇప్పటికీ.. ఎప్పటికీ ఒక డ్రీమర్‌’’ అని ఆమె ట్వీట్‌ చేశారు.  అందం..పట్టుదల, సున్నితత్వం ఆయన సొంతం. మై జెంటిల్‌ జెయింట్‌ అని ఆమె పేర్కొన్నారు. మనం మనంగా జీవించాలి అని భయ్యా (రాకేష్ ఝున్‌ఝున్‌వాలా) ఎపుడూ చెబుతూ ఉండేవారు.  ది లెజెండ్, లెగసీ  నిలిచే ఉంటుందంటూ స్మృతి వరుస ట్విట్లలో సానుభూతి ప్రకటించారు. 

ఇది చదవండి:Rakesh Jhunjhunwala: అ‍ల్విదా బిగ్‌బుల్‌ ఒక శకం ముగిసింది: పలువురి భావోద్వేగం

మరిన్ని వార్తలు