రూ. 1కే డిజిటల్‌ సిల్వర్‌

10 Feb, 2023 05:55 IST|Sakshi

ఆవిష్కరించిన ఎంఎంటీసీ–పీఏఎంపీ

న్యూఢిల్లీ: ఎంఎంటీసీ–పీఏఎంపీ సంస్థ తాజాగా డిజిటల్‌ సిల్వర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని అత్యంత తక్కువగా రూ. 1కి కూడా కొనుక్కోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కావాలంటే ఈ వెండిని తమ కంపెనీకి చెందిన డిజిటల్‌ వాల్ట్‌లో భద్రపర్చుకుని, తర్వాత విక్రయించుకోవచ్చని పేర్కొంది.

డిజిటల్‌ రూపంలో ఉన్నందున పారదర్శకత, 24/7 అందుబాటులో ఉండటం, కచ్చితమైన స్వచ్ఛత, అత్యంత తక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేసే సౌలభ్యం, మేకింగ్‌ చార్జీలు లేకపోవడం వంటి అనేక సానుకూలాంశాలు ఉన్నాయని కంపెనీ ఎండీ వికాస్‌ సింగ్‌ చెప్పారు. ఇప్పటికే డిజిటల్‌ బంగారం విషయంలో తమ సంస్థ మార్కెట్‌ లీడరుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ ఎంఎంటీసీ, స్విట్జర్లాండ్‌కి చెందిన బులియన్‌ బ్రాండ్‌ పీఏఎంపీ కలిసి జాయింట్‌ వెంచర్‌గా ఈ సంస్థను ఏర్పాటు చేశాయి. 

మరిన్ని వార్తలు