మీ పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు అతుక్కుపోతున్నారా?

13 Nov, 2022 07:05 IST|Sakshi

‘అనగనగా’ అనే కథలకంటే ‘కొకోమెలెన్, సూపర్‌ జోజో’ అంటేనే ఊకొడుతున్నారు ఇప్పటి బుజ్జాయిలు. కార్టూన్‌ వీడియోలను, టామ్‌ అండ్‌ జెర్రీ కథలను ఆస్వాదిస్తూ.. అనుకరిస్తూ పెరుగుతున్నారు! ఈ ‘స్మార్ట్‌’ చిచ్చరపిడుగులు. సరైన పద్ధతిలో సాంకేతికతను స్వీకరించేలా చేయడమే ఈ తరం తల్లిదండ్రులకున్న టఫ్‌ టాస్క్‌!  బలవంతంగా ఫోన్‌ లాక్కుని.. వాళ్లకు బోరుకొట్టకుండా సమయాన్ని బ్యాలెన్స్‌ చేయడం అంత ఈజీ కాదు. మరెలా? సింపుల్‌..  మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ కిడ్స్‌ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేస్తే సరి.

మెంటల్‌అప్‌ యాప్‌
ఈ ఎడ్యుకేషనల్‌ లెర్నింగ్‌ యాప్‌.. అన్ని వయసుల వారికీ వినోదభరితమైన సైంటిఫిక్‌ లెర్నింగ్‌ గేమ్‌లను అందిస్తుంది. ఇది క్రిటికల్‌ థింకింగ్‌ గేమ్స్, డెసిషన్‌ మేకింగ్‌ గేమ్స్, అనేక ఇతర సూపర్‌ బ్రెయిన్‌ కాగ్నిటివ్‌ గేమ్స్‌ను ఉపయోగించి పిల్లల మెదడుకి పదునుపెడుతుంది.

123 కిడ్స్‌ అకాడమీ
అక్షరాలు, సంఖ్యలు, పదాలు, రంగులు వేయడం, అద్భుతమైన కథలు, నర్సరీ రైమ్స్‌.. ఇలా అన్నింటినీ ఈ యాప్‌ అందిస్తుంది. ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా వీటన్నింటినీ నేర్చుకోవచ్చు. ఎడ్యుకేషనల్‌ గేమ్స్, ఇంటరాక్టివ్‌ వర్క్‌షీట్స్, క్విజ్‌ వంటివెన్నో ఇందులో ఉంటాయి.

ముస్సిల మ్యూజిక్‌ స్కూల్‌
ఇది పిల్లలకు సంగీతం నేర్పిస్తుంది. పిచ్, రిథమ్, రీడింగ్‌ మ్యూజిక్, మ్యూజిక్‌ థియరీ.. ఇలా ప్రతి దాని మీద అవగాహన కలిగిస్తుంది. వాయిద్యాలు, వాయిద్య శబ్దాలు, లయ, శ్రావ్యతలను గుర్తించడం వంటి టెక్నిక్స్‌ నేర్పిస్తుంది.

ఫోనిక్స్‌ జీనియస్‌ 
(ఐఫోన్, ఐప్యాడ్స్‌లో మాత్రమే)
ఇది అక్షర శబ్దాలతో ఆంగ్ల పదాలను గుర్తించడంలో సహకరిస్తుంది. స్పష్టంగా చదవడం, తప్పులు లేకుండా రాయడం నేర్పిస్తుంది. ఫోనెమిక్‌ అవగాహనను కల్పించడానికి, ఆంగ్లంలో మెరుగైన పద్ధతిలో కమ్యూనికేట్‌ చే యడానికి యూజ్‌ అవుతుంది.     

ముస్సిల మ్యూజిక్‌ స్కూల్‌
ఇది పిల్లలకు సంగీతం నేర్పిస్తుంది. పిచ్, రిథమ్, రీడింగ్‌ మ్యూజిక్, మ్యూజిక్‌ థియరీ.. ఇలా ప్రతి దాని మీద అవగాహన కలిగిస్తుంది. వాయిద్యాలు, వాయిద్య శబ్దాలు, లయ, శ్రావ్యతలను గుర్తించడం వంటి టెక్నిక్స్‌ నేర్పిస్తుంది.

ఆసమ్‌ ఈట్స్‌ (ఐఫోన్‌లో మాత్రమే)

ఈ యాప్‌..హె ల్దీ ఫుడ్‌ మీద చాలా వివరాలను అందిస్తుంది. జంక్‌ ఫుడ్‌కు దూరం చేస్తుంది. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలతో పిల్లలకు వినోదభరితంగా ఆటలు ఆడిస్తూనే.. పోషకాహారం మీద అవగాహన కలిగిస్తుంది.

స్మార్ట్‌ టేల్స్‌ (లెర్నింగ్‌ గేమ్స్‌)
సైన్స్‌ , టెక్నాలజీ, మ్యాథమెటిక్స్‌ వంటి సబ్జెక్ట్స్‌ను తేలికగా పిల్లలకు అందించే ప్రయత్నం చేస్తుంది ఈ యాప్‌. ఆహ్లాదకరమైన, వినోదాత్మకమైన పద్ధతిలో ఈ యాప్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంది. 

మరిన్ని యాప్స్‌: ఖాన్‌ అకాడమీ కిడ్స్‌ (రెండేళ్ల తర్వాత వారికి)
ఎబిసీ మౌస్, ఎపిక్‌(అన్ని వయసుల వారికి), డుయోలింగో(హైస్కూల్‌)
నిక్‌ జూనియర్‌ (ప్రీస్కూల్‌), క్విక్‌ మ్యాథ్‌ జూనియర్‌(ఎలిమెంటరీ స్కూల్‌)
స్విఫ్ట్‌ ప్లేగ్రౌండ్స్‌(కోడింగ్‌), సింప్లీ పియానో(పియానో నేర్చుకోవడానికి) 

మరిన్ని వార్తలు