జేబులోనే పేలిన మొబైల్‌: షాకింగ్‌ వీడియో వైరల్‌ 

20 May, 2023 13:51 IST|Sakshi

న్యూఢిల్లీ: కేరళలో వరుసగా నమోదవుతున్నమొబైల్‌ ఫోన్‌ బ్లాస్ట్‌ సంఘటనలు ఆందోళన రేపుతున్నాయి. కేరళలోని త్రిస్సూర్‌లో 70 ఏళ్ల వృద్ధుడి చొక్కా జేబులో మొబైల్ ఫోన్ పేలడంతో తృటిలో ప్రమాదం తప్పింది. నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో మొబైల్ పేలుడు సంభవించడం ఇది మూడోది. ఇటీవల ఎనిమిదేళ్ల బాలిక మృత్యువాత పడిన ఘటన మర్చిపోక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం  యూజర్లను కలవర పెడుతోంది. (టెక్‌ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్‌: కేంద్ర ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు)

మనోరమ న్యూస్ వివరాల ప్రకారం పెద్దాయన ఇలియాస్‌ టీ షాపులో టీ తాగుతూ ఉండగానే  ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టీ తాగుతుండగానే సడెన్‌గా షర్ట్‌ జేబులో ఉన్న ఫోన్‌కు మంటలు వ్యాపించాయి. చొక్కా మీద మంటలు వ్యాపిస్తున్న షాకింగ్‌  దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. ఈ వీడియో  వైరల్‌గా మారింది. 

ఏడాది క్రితం రూ.1000కు మొబైల్ కొనుగోలు చేశానని,ఇది ఫీచర్ ఫోన్ అని బాధితుడు ఇలియాస్‌ పోలీసులకు తెలిపాడు. ఇప్పటి దాకా ఎలాంటి సమస్యలు లేవని కూడా వెల్లడించాడు. గత వారం, కోజికోడ్ నగరంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒక వ్యక్తి ప్యాంటు జేబులో ఉన్నట్టుండి స్మార్ట్‌ ఫోన్ పేలింది. అయితే  స్వల్ప గాయాలతో  బయటపడ్డాడు. ఫోన్ వేడెక్కడంతోనే బ్యాటరీ పేలిపోయినట్టు సమాచారం. అలాగే త్రిసూర్‍లో కూడా ఎనిమిదేళ్ల బాలిక చేతిలో ఉన్న మొబైల్ పేలి అసువులు బాసిన సంగతి తెలిసిందే.  (Jr. NTR Net Worth: ఖరీదైన కార్లు, లగ్జరీ వాచెస్‌,  ఫ్యాన్స్‌ ఖుషీ!)

మరిన్ని వార్తలు