ఫాక్స్‌కాన్‌కు రూ.357 కోట్లు.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

21 Dec, 2022 13:27 IST|Sakshi

డిక్సన్‌ సబ్సిడరీకి రూ.58 కోట్లు

న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్లకు సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద (పీఎల్‌ఐ).. యాపిల్‌ ఉత్పత్తుల కాంట్రాక్ట్‌ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ ఇండియాకు రూ.357 కోట్లు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అలాగే, డిక్సన్‌ టెక్నాలజీస్‌ సబ్సిడరీ అయిన పాడ్గెట్‌ ఎలక్ట్రానిక్స్‌కు రూ.58 కోట్ల ఉత్పత్తి ప్రోత్సాహకాల మంజూరునకు సైతం ఆమోదం తెలిపింది.

పాడ్గెట్‌ ఎలక్ట్రానిక్స్‌కు మొబైల్‌ ఫోన్ల విభాగంలో తయారీ ప్రోత్సాహకాలు రావడం ఇది రెండో విడత కావడం గమనార్హం. ఈ విభాగంలో ప్రోత్సాహకాలను అందుకోనున్న తొలి కంపెనీ ఫాక్స్‌కాన్‌ కానుంది.

చదవండి: కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్‌!

మరిన్ని వార్తలు