గోద్రెజ్ ప్రాపర్టీస్‌ సీఎండీ మోహిత్ మల్హోత్రా రాజీనామా

2 Aug, 2022 15:55 IST|Sakshi

సాక్షి,ముంబై: గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ మోహిత్ మల్హోత్రా సీఎండీ రాజీనామా చేశారు. మ‍ల్హోత్రా  మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  తన పదవులకు రాజీనామా చేసినట్లు ఆగస్టు 2న  స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి  సమాచారంలో కంపెనీ  వెల్లడించింది.  ప్రస్తుతం నార్త్ జోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న గౌరవ్ పాండే బాధ్యతలు స్వీకరిస్తార కంపెనీ తెలిపింది 

అయితే రాజీనామా చేసిన మల్హోత్రా డిసెంబర్ 31 వరకు ఈయన పదవిలోఉంటారు. ఈనేపథ్యంలో 2023 జనవరి నుంచి గౌరవ్‌ పాండే  కొంత్త సీఎండీగా బాధ్యతలు  స్వీకరించనున్నారు. పాండేకు రియల్ ఎస్టేట్ రంగంలో 17 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉందని పేర్కొంది. కొత్త సీఎండీ గౌరవ్‌ పాండే నియామకంపై గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోజ్షా గోద్రెజ్ సంతోషాన్ని వ్యక్తంచేశారు. భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాలు అపారంగా ఉన్నాయని, పరిశ్రమలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.ఈ విజయాన్ని కొనసాగించేలా మార్గనిర్దేశం చేస్తారని భావిస్తున్నామన్నారు.

కాగా గోద్రెజ్‌లో చేరడానికి ముందు, పాండే రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థ, ప్రాప్‌ఈక్విటీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ & కన్సల్టింగ్ హెడ్‌గా కూడా పనిచేశారు. దీంతోపాటు దేశంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, డెవలపర్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులకు  సలహాలిచ్చేవారు.

మరిన్ని వార్తలు