ఇది ఊహించలేదు.. మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌ లాభం 452% జంప్‌

31 Jan, 2023 10:27 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్, డిజైనింగ్‌ కంపెనీ మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌ డిసెంబర్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ నికరలాభం అంత క్రితంతో పోలిస్తే 452.5% ఎగసి రూ.9.2 కోట్లు సాధించింది. ఎబిటా 300 శాతం పెరిగి రూ.13.6 కోట్లకు చేరింది. టర్నోవర్‌ 71% అధికమై రూ.40.7 కోట్లుగా ఉంది. ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన కంపెనీల మోడళ్లకు 3డీ, 2డీ, రోబోటిక్స్‌ సేవలను అందిస్తున్నామని మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌ సీఎండీ జె.లక్ష్మణ రావు తెలిపారు.

‘ఇటువంటి సర్వీసులను ఆఫర్‌ చేస్తున్న అతికొద్ది భారతీయ కంపెనీల్లో మోల్డ్‌టెక్‌ ఒకటి. యూరప్, మెక్సికో నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. కనెక్షన్‌ డిజైన్, స్ట్రక్చరల్‌ డిజైనింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీలను కొనుగోలు చేస్తాం. ఆర్డర్‌ బుక్‌ ఎన్నో రెట్లు పెరిగింది. ఈ వృద్ధి కొనసాగుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

చదవండి: ఆ జాబ్‌ పోతేనేం, మూడు రోజుల్లో..భారీ ఆఫర్‌:  7.1 మిలియన్ల వ్యూస్‌తో మహిళ వైరల్‌ స్టోరీ

మరిన్ని వార్తలు